అమ‌లాపాల్ కు లైంగిక వేధింపులు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-02-01 02:23:21

అమ‌లాపాల్ కు లైంగిక వేధింపులు

మ‌హిళ‌ల‌ ర‌క్ష‌ణ కోసం న్యాయ‌స్థానం అనేక చ‌ట్టాలు అమ‌లు చేసినా, వారిపై అత్యాచారాలు మాత్రం ఆగ‌డంలేదు... అయితే ఈ మేర‌కు గ‌మ‌నించిన‌ట్లైతే  ప్ర‌తీ రోజు దేశంలో ఏదో ఒక మూల‌ మ‌హిళ‌ల‌పై అత్యాచారాలు, మాన‌భంగాలు జ‌రుగుతూనే ఉన్నాయి... వాటిని అరిక‌ట్టేందుకు కేంద్రం ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా ఫ‌లితం మాత్రం శూన్యం.
 
కాగా ఈ నేప‌థ్యంలో ప్ర‌ముఖ హీరోయిన్ అమ‌లాపాల్ కు సైతం లైంగిక వేధింపులు త‌ప్ప‌లేదు... పారిశ్రామిక వేత్త డాన్స్ స్కూల్ మాస్ట‌ర్ అయిన అళ‌గేశ‌న్ త‌న‌పై అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తిస్తున్నాడ‌ని అమ‌లాపాల్ చెన్నైలోని మాంబ‌ళం పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది... త‌రుచూ  అళ‌గేశ‌న్ త‌న‌స్నేహితుడితో డిన్న‌ర్ కు వెళ్లాల‌ని, నోటికి వ‌చ్చిన మాట‌లు మాట్లాడే వార‌ని ఆమె పోలీసుల‌కు ఫిర్యాదులో  పేర్కోన్నారు...  దీంతో ఆమె ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకుని అళ‌గేశ‌న్ ను  అరెస్ట్  చేశారు... . కాగా అమ‌లాపాల్ ఇటీవలే ప‌న్ను ఎగ‌వేత ఆరోప‌ణ‌ల్లో ఇరుక్కుని వార్త‌ల‌లో నిలిచిన సంగ‌తి తెలిసిందే.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.