ఎన్టీఆర్ కోసం వస్తున్న అమితాబ్ బచ్చన్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

jr ntr and amitabh bachhan
Updated:  2018-09-11 11:22:32

ఎన్టీఆర్ కోసం వస్తున్న అమితాబ్ బచ్చన్

తండ్రి మరణాన్ని సైతం దిగమింగుకుని వృత్తి రీత్యా తనకున్న గౌరవాన్ని ‘అరవింద సమేత’ షూటింగ్ లో పాల్గొంటున్న జూనియర్ ఎన్టీఆర్ ను చూస్తే అతను ఇక జూనియర్ స్థాయిని దాటేశాడేమో అనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చిత్రాన్ని వచ్చేనెల పదకొండవ తరీఖున విడుదల చేయాలని ధృడనిశ్చయంతో దర్శకనిర్మాతలు కనిపిస్తున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ఆడియో రిలీజ్ వేడుకలో చెప్పే సూచనలు కనిపిస్తున్నాయి.

యస్ యస్ తమన్ బాణీలకు ఎన్టీఆర్ కాళ్లు తోడైతే థియేటర్ లలో అభిమానుల తీరు ఏ విధంగా ఉంటుందో ఇది వరకే చూసాం. ఈ సారి కూడా అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తున్నారని వినికిడి. ఇదిలా ఉండగా ఈ చిత్రానికి సంబంధించిన మరో వార్త సినీ పరిశ్రమలో చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం అరవింద సమేత వీర రాఘవలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఒక స్పెషల్ క్యామియోలో కనిపిస్తారట.

ఎంతసేపు కనిపిస్తారు, ఎలా కనిపిస్తారు అనేది ఒక వాదన అయితే అసలు ఇది ఈ సినిమా తాలూకు పుకారా..? నిజంగా ఆయన ఈ సినిమా లో కనిపిస్తారా అనేది తెలియాల్సి ఉంది.ఇప్పటికే ఆయన్ని ‘మనం’ సినిమాలో చిన్న అతిథి పాత్రలో చూశాం. ‘సైరా’ లో కూడా చిరు కి గురువులా కనిపించనున్నారు. ఇంకా కొన్ని కొన్ని ఇతర దక్షిణ భారత సినిమాల్లో కూడా ఆయన ఇలాంటి పలకరింపులు చేశారు.