ప్ర‌ణ‌య్ అక్ర‌మ సంబంధాల‌పై అమృత క్లారిటీ

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

amruthapranay
Updated:  2018-09-24 03:02:16

ప్ర‌ణ‌య్ అక్ర‌మ సంబంధాల‌పై అమృత క్లారిటీ

మిర్యాల‌గూడలో కొద్ది రోజుల‌క్రితం ప్ర‌ణ‌య్ ప‌రువు హ‌త్య ఇరు తెలుగు రాష్ట్రాల‌ను ఆశ్చ‌ర్యానికి గురిచేసిన సంగ‌తి తెలిసిందే. ఇక ఈ ఘ‌ట‌న గురించి ప్ర‌జ‌లు రెండు వ‌ర్గాలుగా విడిపోయి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసుకుంటున్నారు. ఒక వ‌ర్గం ఏమో ఈ హ్య‌త‌కు కుల వివ‌క్ష‌త‌ను ముడిపెట్టి మాట్లాడుతూ ఉంటే, మ‌రికొదంద‌రు అమృత తండ్రి మారుతీ రావుకు స‌పోర్ట్ చేస్తూ తండ్రి కూత‌రు మ‌ధ్య ఉన్న ప్రేమ‌ను వ్య‌క్త ప‌రుస్తూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ లు చేస్తున్నారు.
 
అంతేకాదు ప్ర‌ణ‌య్ ఒక రోమియో అని తొమ్మిద‌వ త‌ర‌గ‌తి నుంచి అమృత‌ను ప్రేమించినా వేరే అమ్మాయిల‌తో సంబంధం ఉంద‌ని సోష‌ల్ మీడియాలో ఒక వ‌ర్గం ట్రోల్ చేస్తుంది. అయితే తాజాగా అమృత ఈ విష‌యాల‌పై స్పందించింది.  ప్ర‌ణ‌య్ ఉన్న‌ది త‌న‌తో త‌న త‌ల్లిదండ్రుల‌తో మాత్ర‌మే ఉన్నార‌ని ఆమె స్ప‌ష్టం చేశారు. త‌న‌కు తెలియ‌ని విష‌యాలు ఎలా బ‌య‌ట‌కు వ‌స్తాయ‌ని ఆమె మండిప‌డ్డారు.
 
కాలేజ్ లో ప్ర‌ణ‌య్ ఫ్రెండ్స్ తో మాట్లాడేవార‌ని ఆ స‌మ‌యంలో తాను కూడా వారితో మాట్లాడేదానిన‌ని అమృత గుర్తు చేశారు. ఒక అమ్మాయితో మాట్లాడినంత మాత్ర‌న అందులో త‌ప్పేముంద‌ని ప్ర‌శ్నించారు. ఇష్టం వ‌చ్చిన‌ట్లు ట్వీట్లు చేస్తే వారిపై కేసుపెడ‌తాన‌ని హెచ్చ‌రించారు అమృత‌.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.