ధనుష్ ని బజార్లోకి లాగే పని చేస్తున్న అమైరా దస్తూర్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

amyra dastur
Updated:  2018-10-13 05:27:55

ధనుష్ ని బజార్లోకి లాగే పని చేస్తున్న అమైరా దస్తూర్

అమైర దస్తూర్ అనే హీరోయిన్ ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీ లో హీరోయిన్ గా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇటివలే ఆమె మీడియాతో ఒక స్టార్ హీరో తనని గట్టిగా హత్తుకొని ఇబ్బంది పెట్టాడు అని చెప్పుకొచ్చింది.  అతడికి సహకరించనందుకు చిత్ర బృందం తనను చాలా ఇబ్బంది పెట్టిందని ఆమె చెప్పింది.

యితే అమైరా హిందీలోనే కాక తమిళ, తెలుగు భాషల్లోనూ సినిమాలు చేసింది. ఆమె ఇప్పుడు ఓ దక్షిణాది హీరోను టార్గెట్ చేయడం విశేషం. ఆ హీరో పేరు ఆమె చెప్పలేదు గాని ఆ హీరో మాత్రం ధనుష్ ఏ అని చాలా మంది అంటున్నారు. అమైరా తెలుగులో రాజ్ తరుణ్ సరసన "రాజు గాడు" అనే సినిమాలో అలాగే సందీప్ కిషన్‌తో మనసుకు నచ్చింది అనే సినిమాల్లో నటించింది. తమిళంలో ధనుష్ సరసన "అనేగన్" అనే సినిమా చేసింది.

అయితే తనను ఒక దక్షిణాది హీరో ఇబ్బంది పెట్టాడని అతనో స్టార్ హీరో అని బాగా ఫేమస్ అని కూడా చెప్పింది, కానీ రాజు తరుణ్, సందీప్ కిషన్ స్టార్ హీరోలు కాదు. ఇక అమైర తో కలిసి నటించిన ఏకైక స్టార్ హీరో ధనుష్. అందుకే అమైర ని ఇబ్బంది పెట్టిన ఆ హీరో ధనుష్ ఏ అని అందరూ చాలా గట్టిగా భావిస్తున్నారు. 

 
 

షేర్ :