బాలుడు సెల్ఫీ అడిగినందుకు అనసూయ ఏం చేసిందంటే?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-02-06 04:28:32

బాలుడు సెల్ఫీ అడిగినందుకు అనసూయ ఏం చేసిందంటే?

బుల్లి తెర‌లో ప్ర‌సార‌మ‌య్యే జ‌బ‌ర్ద‌స్త్ షో ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యమ‌య్యారు యాంక‌ర్ అన‌సూయ‌... ఈ షోలో త‌న అందచందాల‌తో  అల‌రిస్తూ ప్రేక్ష‌కుల‌ను మ‌త్తెక్కిస్తోంది ఈ బుల్లి తెర యాంక‌ర్... అయితే ప్ర‌స్తుతం బుల్లితెర‌లో టాప్ యాంక‌ర్ గా కొన‌సాగుతున్నారు అన‌సూయ‌....  ఈమె యాంక‌ర్ గానే కాకుండా వెండితెర‌లోను సోగ్గాడే చిన్నినాయ‌నా, క్ష‌ణం, ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ హీరోగా న‌టిస్తున్న చిత్రం రంగ‌స్థ‌లం ఈ సినిమాలో అన‌సూయా మొయిన్ రోల్  లో న‌టిస్తున్నారు.
 
ఈ నేప‌థ్యంలో తాజాగా ఈ రోజు అన‌సూయ వివాదంలో చిక్కుకుంది... ఏదో ప‌ని మీద హ‌డావిడిగా తార్నాక ప్రాంతానికి వెళ్తోంది అన‌సూయ‌... స్ధానికంగా అక్క‌డ నివాసం ఉండే  త‌ల్లి, కొడుకు క‌లిసి అటుగా వెళుతున్న స‌మ‌యంలో రోడ్డు ప్ర‌క్క‌న అన‌సూయ ఏదో విష‌యంపై వేరే ఒక‌రితో మాట్లాడుతూ ఉండ‌గా... ఆ బాలుడు జ‌బ‌ర్ద‌స్త్ యాంక‌ర్ క‌నిపించ‌గానే ప‌రిగెత్తుకుంటూ వెళ్లాడు... అభిమానంతో  అన‌సూయ‌తో సెల్ఫీ తీసుకునేందుకు య‌త్నించాడు...  అప్ప‌టికే ఏదో విష‌యంలో చిరాకుతో ఉన్న అన‌సూయ ఆ బాలుడి చేతిలో ఉన్న మొబైల్ ను తీసుకుని ఆవేశంతో నేల‌కేసి ప‌గ‌ల‌కొట్టారు.
 
అయితే అక్క‌డే ఉన్న ఆ కుమారుడి త‌ల్లి కోపంతో త‌న కుమారుడి ఫోన్  ఎందుకు ప‌గ‌ల‌గోట్టావ‌ని అన‌సూయ‌ను ప్ర‌శ్నించ‌గా స‌మాధానం చెప్ప‌కుండా కోపంతో అక్క‌డి నుంచి కారులో వెళ్లి పోయారు... దీంతో త‌న కొడుకు మొబైల్ ప‌గ‌ల‌గొట్టింద‌న్న ఆగ్రహంతో ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలోని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది బాలుడి త‌ల్లి. అనసూయపై చర్యలు తీసుకోవాలని ఆ మహిళ పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.