అఫైర్ పై రంగ‌మ్మ‌త్త‌ క్లారిటీ

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

anasuya and ram gopal varma
Updated:  2018-04-07 04:03:59

అఫైర్ పై రంగ‌మ్మ‌త్త‌ క్లారిటీ

ఓ ప్ర‌ముఖ ఛాన‌ల్ ల్లో ప్ర‌సార‌మ‌య్యే జ‌బ‌ర్ద‌స్త్ షో ద్వారా ప‌రిచ‌య‌మైంది యాంక‌ర్ అన‌సూయ‌... త‌న వాక్చాతుర్యం
డ్ర‌స్సింగ్ స్టైల్ తో ఈ షో ద్వారా తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌ను ఫిదా చేసింది ఈ బుల్లితెర బ్యూటీ... అయితే ఈమె ప్ర‌స్తుతం బుల్లితెర యాంక‌ర్ గానే కాకుండా వెండితెరలో అక్కినేని నాగార్జున న‌టించిన సోగ్గాడే చిన్న నాయ‌నా, క్ష‌ణం సినిమాల్లో న‌టించింది...తాజాగా వ‌చ్చిన రంగ‌స్థ‌లంలో కూడా రామ్ చ‌ర‌ణ్ కు రంగ‌మ్మ‌త్త క్యారెక్ట‌ర్ తో  ప్రేక్షకులను అలరించింది యాంక‌ర్ అన‌సూయ‌.
 
అయితే తాజాగా ఓ ప్ర‌ముఖ ఛాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో రంగ‌స్థ‌లం సినిమా గురించి మాట్లాడారు అన‌సూయ‌... రంగమ్మత్త క్యారెక్టర్ తన బాధ్యతను మరింత పెంచిందని, త‌న‌కు ఈ అవ‌కాశం ఇచ్చిన రంగ‌స్థ‌లం టీమ్ కు చాలా రుణ‌ప‌డి ఉంటాన‌ని మీడియా ద్వారా తెలిపింది... అలాగే ఈ సినిమా తర్వాత రెమ్యునరేషన్ పెంచాననే వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని చెప్పింది బుల్లి తెర బ్యూటీ.
 
తాను మీడియాలో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి చిత్ర ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు పెట్టినా, త‌న‌పై సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుని  నెటిజ‌న్లు అనేక ఆరోప‌ణ‌లు చేశార‌ని అన్నారు..తాను గ‌తంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో కలసి పని చేశానని... ఆ సమయంలో ఆయనతో తనకు అఫైర్ అంటగట్టారని ఆవేదన వ్యక్తం చేసింది అన‌సూయ‌. తాను ఆస‌మ‌యంలో గ‌ర్భ‌వ‌తిన‌ని ఈ విష‌యం తెలియగానే ఎంతో బాధ‌ప‌డ్డాన‌ని అనుసూయ చెప్పుకొచ్చారు.. అయితే ఇదే విష‌యాన్ని త‌న భ‌ర్త‌తో చెప్పాన‌ని అన్నారు.. కానీ త‌న‌కు త‌న భ‌ర్త అండ ఉండ‌డంతో తాను దేనికి బ‌య‌ప‌డలేద‌ని చెప్పింది ఈ రంగ‌మ్మ‌త్త‌.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.