అన‌సూయ మ‌న‌సు మార్చుకోవా ?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

anchor anasuya image
Updated:  2018-03-08 11:02:44

అన‌సూయ మ‌న‌సు మార్చుకోవా ?

బుల్లితెరలో వ‌చ్చే  జ‌బ‌ర్ద‌స్త్ షో ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మ‌య్యారు యాంక‌ర్ అనుసూయ‌....  బుల్లి తెర యాంక‌ర్స్ లో ప్ర‌స్తుతం టాప్  యాంక‌ర్ గా కొన‌సాగుతోంది ఈ ముద్దుగుమ్మ‌... అంతే కాకుండా వెండితెర‌లో కూడా ప‌లు చిత్రాల‌కు హీరోయిన్ గా నటించింది అన‌సూయ‌.
 
అయితే తాజాగా అన‌సూయ త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ ను తొల‌గించింది.... గ‌త కొద్ది కాలంగా ఈ అందాల భామ సోష‌ల్ మీడియాలో ఏ రేంజ్ లో ఫేమ‌స్ అయిందో మ‌నంద‌రికీ తెలిసిందే...త‌క్కువ స‌మ‌యంలో  సోష‌ల్ మీడియాలో అంత‌టి స్థానాన్ని సంపాదించుకున్నఅనుసూయ ఒక్క సారిగా త‌న అకౌంట్ ను డిలేట్ చేసింది...  దీనికి ముఖ్య‌కార‌ణం నెటిజ‌న్లు ఆమెపై  చేస్తున్న‌ కామెంట్లు... ఈ కామెంట్ల‌ను త‌ట్లుకోలేకే అన‌సూయ త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ ని తొల‌గించిన‌ట్లు తెలుస్తోంది.
 
అయితే ఇటీవ‌లే త‌న అభిమాని అయిన చిన్న పిల్లాడు అన‌సూయ‌తో సెల్ఫీ తీసుకోవడానికి వచ్చిన స‌మ‌యంలో  ఆ కుర్రాడి చేతిలో ఉన్న ఫోన్‌ను అనసూయ ప‌గ‌ల‌గొట్ట‌డంతో విమర్శలు వ‌చ్చాయి. ఈ వివాదం సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అయిన సంగ‌తి తెలిసిందే... ఈ ఘటనతో మనస్తాపానికి గురైన అనసూయ.. త‌న సోషల్ మీడియాకు చాలా రోజుల నుంచి దూరమైంది. దీంతో సన్నిహితులు మాత్రం సోషల్ మీడియాకు దూరం కావడం మంచిది కాదని.. ఇలా చేస్తే ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గిపోతుందని సూచించారట. అయితే తాను తిరిగి సోషల్ మీడియాలో చురుగ్గా పాల్గొనాలంటే తనకు మరికొంత సమయం కావాలంటోందట అన‌సూయ‌.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.