నెటిజ‌న్ల భ‌యంతో అన‌సూయ ఏం చేసిందో చూడండి

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-02-07 02:58:01

నెటిజ‌న్ల భ‌యంతో అన‌సూయ ఏం చేసిందో చూడండి

జ‌బ‌ర్ద‌స్త్  షోలో యాంక‌ర్ గా తెలుగు ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యమ‌య్యారు అన‌సూయ‌...  ఆ త‌ర్వాత బుల్లి తెర‌లో అంచ‌లంచెలుగా ఎదుగుతూ  స్టార్ యాంక‌ర్ గా గుర్తింపు తెచ్చుకుంది ఈ బుల్లి తెర భామ‌...  ప్ర‌స్తుతం జ‌బ‌ర్ద‌స్త్ షోలోనే కాకుండా ప‌లు ఛాన‌ల్స్ లో ప్ర‌సార‌మ‌య్యే ప్రోగ్రామ్ ల‌కు యాంక‌రింగ్ చేస్తూ, త‌న అందచందాల‌తో ప్రేక్ష‌కుల‌ను మ‌త్తెక్కిస్తోంది ఈ వ‌య్యారి బుల్లి తెర యాంక‌ర్... టీవీ షోల‌తో బిజీగా ఉన్న అన‌సూయ వెండి తెర‌మీద కూడా త‌న న‌ట‌న‌తో సంద‌డి చేస్తోంది. 
 
ఈ నేప‌థ్యంలో నిన్న జ‌రిగిన సంఘ‌ట‌న సంచ‌ల‌నంగా మార‌డంతో  అన‌సూయ  సోష‌ల్ మీడియా అకౌంట్ల‌కు గుడ్ బాయ్ చెప్పేసింది... నిన్న‌ కారులో హ‌డావుడిగా తార్నాక వైపు వెళ్లింది అన‌సూయ, ఆ ప్రాంతంలో రోడ్డు ప్ర‌క్క‌న కారు ఆపి ఏదో విష‌యంపై వేరొక‌రితో మాట్లాడుతోంది... స్థానికంగా అక్క‌డే నివ‌సిస్తున్న‌టువంటి  ఓ త‌ల్లి కొడుకు అటుగా వెళ్తున్న  అన‌సూయ క‌నిపించ‌గానే ఆగారు,  ఆ బాలుడు అన‌సూయ‌తో సెల్ఫీ తీసుకునేందుకు య‌త్నించాడు....  అన‌సూయ ఆవేశంతో  ఆ బాలుడు ఫోన్ ప‌గ‌ల కొట్టింది... దీంతో ఆ బాలుడి త‌ల్లి త‌న కుమారుడి ఫోన్ అన‌సూయ ప‌గ‌ల‌గోట్టిందంటూ ఫిర్యాదు చేయ‌డంతో అన‌సూయ‌పై పెద్ద ఎత్తున సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. 
 
అయితే నిన్న జ‌రిగిన సంఘ‌ట‌న గురించి నెటిజ‌న్ల‌కు క్లారిటీ ఇచ్చేందుకు  అన‌సూయ య‌త్నించినా కాని, విమ‌ర్శ‌లు మాత్రం త‌గ్గుముఖం ప‌ట్ట‌క‌పోవ‌డంతో చేసేది ఏమీ లేక చివ‌రికి అన‌సూయ త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ ని తొల‌గించింది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.