మీ టూ పై అన‌సూయ షాకింగ్ కామెంట్స్‌

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

anasuya anchor
Updated:  2018-10-12 01:21:46

మీ టూ పై అన‌సూయ షాకింగ్ కామెంట్స్‌

ప్రస్తుతం టీవీ లో న్యూస్ ఛానల్ అయినా సోషల్ మీడియా అయినా, మీ టూ ఉద్యమం ఒక హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్‌ నటి తనూశ్రీ దత్తా, నటుడు నానా పటేకర్‌పై చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల తరువాత ఒకరి తరువాత ఒకరు వచ్చి చేరి పెద్ద పెద్ద పేర్లు బయటకు తీస్తుండడంతో, మీ టూ వ్యవహారం మరింతగా సంచలనాత్మకంగా మారింది.

ఇక సౌత్‌లో, గాయని చిన్మయి తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బయటపెట్టేసారికి ఇక్కడా ఈ వేడి బాగా పెరిగింది. తాజాగా, దీనిపై స్టార్ యాంకర్‌ అనసూయ స్పందించింది.పని చేసే చోట లైంగిక వేధింపులు అత్యంత దురదృష్టకరమని, లైంగిక వేధింపుల బాధితుల్లో మహిళలే కాదు, చిన్న పిల్లలూ, చివరికి మగవాళ్ళు కూడా ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.

ఇక ఎలాంటి ప్రలోభాలకు గురికాకపోవడం, ధైర్యంగా నిలబడటం వల్ల ఇలాంటి లైంగిక వేధింపుల బారిన పడకుండా ఉండచ్చని తన అభిప్రాయాన్ని వెల్లడించింది. అయితే, తనకు తెలిసినంతవరకు టాలీవుడ్‌లో లైంగిక వేధింపుల ఘటనలు తక్కువేనని చెప్పింది అనసూయ. ఏ విషయమైనా తన అభిప్రాయాన్ని ఏమాత్రం భయపడకుండా మాట్లాడేసే అనసూయ ఈ విషయంలో కొంచెం సేఫ్ గా సమాధానం చెప్పింది అని కొందరు అంటున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.