ప్రదీప్ కు కోర్టులో షాక్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-01-21 12:13:56

ప్రదీప్ కు కోర్టులో షాక్

బుల్లితెర యంగ్ డైన‌మిక్ యాంక‌ర్ ప్ర‌దీప్ నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల‌లో పాల్గొని... డిసెంబ‌ర్ 31 వ తేదిన అర్థ‌రాత్రి మ‌ద్యం సేవించి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు కింద చిక్కిన‌ సంగ‌తి తెలిసిందే... అయితే ఆయ‌న‌కు బ్రీత్ అన‌లైజ‌ర్ ప‌రీక్ష‌లో మ‌ద్యం సేవించిన‌ట్లు పోలీస్ అధికారులు నిర్ధారించ‌డంతో నేడు ప్ర‌దీప్ ను న్యాయ‌స్థానం ముందు హాజ‌రు ప‌రిచారు.

ఈ నేప‌థ్యంలో న్యాయ‌స్థానం ముందు హాజ‌రైన ప్ర‌దీప్ ను ప‌లువురు న్యాయ‌మూర్తులు అనేక ప్ర‌శ్న‌లు అడిగిన‌ట్లు తెలుస్తోంది... మీడియాలో మ‌ద్యం సేవించి వాహ‌నం న‌డ‌ప‌కూడ‌దని ప్ర‌చారం చేసిన మీరు, మ‌ద్యం సేవించి వాహ‌నం న‌డిపితే ఎలా అని ప్ర‌దీప్ ను ప్ర‌శ్నించిన‌ట్లు తెలుస్తోంది...  అయితే  ఆ రోజు డ్రైవ‌ర్ లేనందు వ‌ల్లే తాను కారు డ్రైవ్ చేశాన‌ని ప్ర‌దీప్ చెప్పిన‌ట్లు  తెలుస్తుంది.

కాగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ప్ర‌దీప్ మ‌ద్యం సేవించిన‌ట్లు న్యాయ‌స్థానం ఋజువులో  తేల‌డంతో....  అత‌ని డ్రైవింగ్ లైసెన్స్ ను మూడెళ్ల పాటు ర‌ద్దు చేస్తూ నాంప‌ల్లి కోర్టు తీర్పునిచ్చింది..దీంతో పాటు ప్ర‌దీప్ కు 2100 రూ జ‌రిమానా న్యాయ‌స్థానం విధించింది.

 

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.