నేను ల‌వ్ ప్రపోజ్ చేశా ర‌ష్మి

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-06-18 13:36:03

నేను ల‌వ్ ప్రపోజ్ చేశా ర‌ష్మి

బుల్లి తెరలో ఓ ప్ర‌ముఖ‌ ఛాన‌ల్ ల్లో ప్ర‌సార‌మ‌య్యే జ‌బ‌ర్ద‌స్త్ షో ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయింది  యాంక‌ర్ ర‌ష్మి. బుల్లి తెర యాంక‌ర్స్ లో ప్ర‌స్తుతం టాప్‌ యాంక‌ర్ గా కొన‌సాగుతోంది ఈ ముద్దుగుమ్మ‌. అంతే కాదు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌వీన్ స‌త్తార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం గుంటూరు టాకీస్. ఈ చిత్రంలో ర‌ష్మి హీరోయిన్ గా న‌టించి వెండితెర‌లో కూడా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ‌.
 
తాజాగా ర‌ష్మి ఓ ప్ర‌ముఖ ఛాన‌ల్ కు ఇంట‌ర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంట‌ర్వ్యూలో ఆమె మాట్లాడుతూ త‌న పెళ్లి ప్ర‌స్తావ‌ గురించి మీడియాతో చెప్పింది. తాను ఇప్పుడే పెళ్లి చేసుకోన‌ని, ఆ స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు అదే జ‌రుగుతుంద‌ని అన్నారు. తాను ఎప్పుడైతే  ఆర్థికంగా సెటిల్ అవుతానో అప్పుడే పెళ్లి గురించి ఆలోచిస్తాన‌ని చెప్పింది.
 
అలాగే లవ్ ప్రపోజల్స్ ఏమైనా వ‌చ్చాయాయ‌ని మీడియా ప్ర‌తినిధి ప్ర‌శ్నించ‌గా దీనికి ర‌ష్మి స‌మాధానం ఇస్తూ అవన్నీ లైఫ్‌లో ఒక భాగమని, గ‌తంలో త‌న‌కు చాలామంది ప్రపోజ్ చేశారని చెప్పింది. అంతేకాదు  ఐదేళ్ల క్రితం తాను కూడా ప్రపోజ్ చేసినట్లు తెలిపారు. ఇప్పుడు అవ‌న్ని ప‌క్క‌న పెట్టి కెరియ‌ర్ పై దృష్టి సాదిస్తున్నాన‌ని చెప్పింది ర‌ష్మి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.