సుమ నేతృత్వంలో ముందుకి సాగనున్న మీ టూ

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

anchor suma
Updated:  2018-10-17 01:18:50

సుమ నేతృత్వంలో ముందుకి సాగనున్న మీ టూ

అటు బాలీవుడ్ లోనే కాక ఇటు టాలీవుడ్ లో కూడా మీ టూ ఉద్యమం జోరు బాగా పెరిగింది. ఇప్పటికే చాలా మంది తమకు జరిగిన లైంగిక వేధింపులను బయటకి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ యాంకర్ సుమ కనకాల నేతృత్వంలో ఒక కార్యాచరణ జరుగుతోంది.
 
తమపై జరిగిన లైంగిక వేధింపుల్ని బయటపెట్టేందుకు సుమ కనకాల ఆధ్వర్యంలో కొందరు నటీమణులు, సాంకేతిక నిపుణులు, ఫిల్మ్ చాంబర్ బిల్డింగ్‌ లో అత్యవసరంగా సమావేశం అయ్యారు. ఈ సమావేశం లో మరో యాంకర్ ఝాన్సీ, దర్శకురాలు నందినీ రెడ్డి కూడా హాజరయ్యారు. ఇప్పుడు ఫిల్మ్ చాంబర్‌లో సుమ కనకాల నేతృత్వంలో సాగుతున్న ఈ సమావేశంలో ఇప్పటికే కొన్ని గైడ్ లైన్స్‌ను సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. 
 
ఎంతగా వేధించినా, మరణించిన నటులు, దర్శకులు, నిర్మాతల గురించి మాత్రం మాట్లాడకూడదని నిబంధన పెట్టుకున్నట్లు సమాచారం. వారు సమాధానం ఇచ్చుకోలేరు కాబట్టి వారిపై ఆరోపణలు చేయడం మంచిది కాదని ఈ నిబంధనను పెట్టుకున్నారు. ఈ క్రమంలో చాలా మంది పెద్ద నటులు, దర్శకులు, నిర్మాతల పేర్లు బయటకు వస్తాయి అని అందరూ అనుకుంటున్నారు.
 
అయితే, ఇంత కాలం మౌనంగా భరించిన వారు ఎంత మంది భయం లేకుండా బయటకి వస్తారు అనేది సందేహమే. ఎందుకంటే, ఇలా చేయడం వల్ల కెరీర్ దెబ్బతినకూడదు కదా అని ఆలోచించే వారు ఉంటారు. చూద్దాం ఎంతమంది ధైర్యం గా వచ్చి మంచితనం ముసుగులో తిరిగే అలాంటి వారి అసలు స్వరూపాన్ని బయటకి తీసుకువస్తారో.

షేర్ :

Comments

0 Comment