బాగా తగ్గిన అంజలి రేటు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

heroine anjali
Updated:  2018-09-06 11:59:45

బాగా తగ్గిన అంజలి రేటు

దీపం ఉండగానే ఇళ్ళు చక్కబెట్టుకోవాలనే సామెత లానే ఇప్పుడు హీరోయిన్ లు కూడా వ్యవహరిస్తున్నారు. ‘’షాపింగ్ మాల్’, ‘జర్నీ’ లాంటి డబ్బింగ్ సినిమాల తోపాటు "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" లాంటి తెలుగు సినిమాల్లో మెరిసిన తెలుగు బ్యూటీ ఇప్పుడు ఆఫర్లు లేక సతమతమవుతుంది. దాంతో తన రేటుని బాగా తగ్గించేసి ఇప్పుడు ఆఫర్ వస్తే చాలు రా బాబు అన్న స్థాయికి పడిపోయింది.
 
ఒక్క తెలుగులొనే కాకా తమిళ్ లో కూడా పాప కి ఇదే పరిస్థితి. "గీతాంజలి" వంటి చిన్న సినిమా కూడా పెద్ద హిట్ అవ్వడానికి కారణం అయినా అంజలి ఆ తర్వాత సరిగ్గా కనబడింది లేదు. అప్పుడప్పుడు ఐటమ్ సాంగ్స్ లో కనబడుతోంది తప్పితే మొత్తం సినిమాలో కనిపించడం లేదు. ఇటీవల ఓ చిన్న సినిమాను కెలం రూ.60 లక్షలకు ఒప్పేసుకుందంటా! కొత్త పాపలే ఇప్పుడు 60 లేదా 70 లక్షలు గుంజుతున్నారు మరి ఈ అమ్మడు పాపం ఇంత నటనా అనుభవం ఉండి కూడా 60 తీసుకుంటుంది అంటే పరిస్థితి ఎక్కడివరకు వచ్చిందో అర్ధం చేస్కోండీ!
 
బహుశా హిట్ వచ్చాకా పారితోషకం పెంచుదాం అనుకుంటుందేమో! అలా అనుకునే చాలా మంది హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకొని సెటిల్ అయిపోయారు. మరి ఈ ముదురు భామ ఏం చేస్తుందనేది ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.