భారీ ఫ్లాప్ కాంబినేషన్ మళ్ళి రిపీట్ కానుంది

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

tollywood
Updated:  2018-09-19 11:52:04

భారీ ఫ్లాప్ కాంబినేషన్ మళ్ళి రిపీట్ కానుంది

“మహానటి” చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి సావిత్రమ్మ గారి జీవితాన్ని నాగ్ అశ్విన్ దర్శకత్వంలో, కీర్తి సురేష్ ద్వారా తెరకు పరిచయం చెయ్యడమే కాకుండా తమని తాము మళ్ళి పూర్వ వైభవంలోకి తీకుని రాగలిగారు ‘వైజయంతి మూవీస్’ వారు. కొత్త రక్తం ఎక్కించుకున్న ఈ సంస్థ నవయువ నిర్మాణ సంస్థగా మారి వినూత్న చిత్రాల్ని ప్రేక్షకులకు ఇవ్వడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది.
 
సావిత్రమ్మ ఇచ్చిన సక్సెస్ చలువ వల్ల కాబోలు ఇప్పటికే జూ.ఎన్టీఆర్ తో పాటు విజయ్ దేవరకొండతో ఓ సినిమా చెయ్యడాన్నికి ఆయా హీరోలతో ఒప్పందం కుదుర్చుకుందని ఆ సంస్థ అధినేత అశ్వనీదత్ వెల్లండించారు ఎన్టీఆర్ తో ఇదివరకు "శక్తి" అనే భారీ ఫ్లాప్ సినిమాని ప్రొడ్యూస్ చేసాడు అశ్విని దత్. అదేవిధంగా తమిళ దర్శకుడు అట్లీ తో కూడా మరో చిత్రం చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు ఆయనే స్వయంగా పత్రిక విలేఖరుల సమేవేశం లో ప్రకటించారు. 
 
ఆ చిత్రాన్ని ద్విబాషా చిత్రంగా నిర్మించే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ నిర్మాణ సంస్థలో ప్రస్తుతం నాని, నాగార్జున మల్టి స్టార్రర్ గా నటిస్తున్న “దేవదాస్” దాదాపు చిత్రీకరణ పూర్తయ్యి విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సినిమా గురించి ఏర్పాటు చేసిన సమావేశం లో ఆయన ఈ విషయాలన్నీ చెప్పుకొచ్చారు. కాగా దేవదాస్ ఈ నెల 27వ తారీఖున విడుదల చేయనున్నట్లు అయన అధికారికంగా ప్రకటించారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.