ఎన్టీఆర్ బయోపిక్ లో ఆ నటదిగ్గజం లేడు....

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-08-02 11:29:04

ఎన్టీఆర్ బయోపిక్ లో ఆ నటదిగ్గజం లేడు....

క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న సినిమా "ఎన్టీఆర్". మహానటుడు అయిన ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాని తెరకేక్కిస్తున్నాడు. అయితే ఎన్టీఆర్ జీవితం గురించి మాట్లాడుకుంటే ఏఎన్ఆర్ గురించి తప్పకుండా మాట్లాడుకుంటారు. అయితే లేటెస్ట్ న్యూస్ మేరకు "ఎన్టీఆర్" బయోపిక్ లో ఏఎన్ఆర్ పాత్రని మాత్రం చూపించరని తెలుస్తుంది...
 
కానీ గతం లో ఏఎన్ఆర్ పాత్ర కోసం సుమంత్ ని అడిగారు అనే రూమర్స్ వినిపించాయి. ఇప్పుడు మాత్రం అసలు ఏఎన్ఆర్ పాత్రే మూవీ లో ఉండదు అని తెలుస్తుంది. ఈ చిత్ర యూనిట్ మొదటి షెడ్యూల్ షూటింగ్ ని పూర్తి చేసుకున్నారు. ఇక ప్రస్తుతం దర్శకుడు క్రిష్ ఈ చిత్రం నెక్స్ట్ షెడ్యూల్ షూటింగ్ పనుల్లో చాలా బిజీ గా వున్నారు. బాలీవుడ్ నటి అయిన విద్య బాలన్ ఈ సినిమాలో బసవతారకం పాత్రలో నటిస్తుంది. ఎం.ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాని వారాహి చలని చిత్రం పై సాయి కొర్రపాటి నిర్మిస్తున్నాడు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.