సినిమా అవకాశాల వెనుక అసలు సీక్రెట్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-01-26 01:18:18

సినిమా అవకాశాల వెనుక అసలు సీక్రెట్

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు మ‌జ్ను సినిమాతో ప‌రిచ‌య‌మైన భామ అను ఇమ్మాన్యూయేల్. మొద‌టి సినిమాతోనే అభిమానుల‌ను, చిత్ర ప‌రిశ్ర‌మ‌ను ఆక‌ర్షించింది ఈ అమ్మ‌డు. అయితే ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో అగ్ర క‌థానాయిక‌ల‌ను వెన‌క్కునెట్టి అవ‌కాశాల‌ను చేజిక్కించుకుంటోంది.

2018లో అజ్ఞాతవాసి సినిమాతో మొద‌టి ఫెయిల్యూర్ అందుకుంది అను ఇమ్మాన్యూయేల్. ఈ అప‌జ‌యంతో కెరీర్ డిలా ప‌డుతుంద‌నుకున్నా.... ఈ క‌థానాయిక‌కు వ‌రుసగా అవ‌కాశాల‌ను ఇస్తున్నారు సినీ ద‌ర్శ‌కులు. ఇప్ప‌టికే అల్లుఅర్జున్ స‌ర‌స‌న‌ నా పేరు సూర్య‌, నాగ‌చైత‌న్య‌తో శైల‌జారెడ్డి సినిమాల్లో న‌టిస్తుండ‌గా.... ఇక ఈ యేడాది త‌న‌దే అన్న‌ట్టు రామ్‌చ‌ర‌ణ్‌, సాయిధ‌ర‌మ్‌తేజ్ స‌ర‌స‌న‌ న‌టించ‌డానికి రెడి అయిపోతోంది.

అజ్ఞాతవాసి లాంటి పెద్ద‌ సినిమా డిజాస్ట‌ర్ త‌ర్వాత కూడ అమ్మ‌డు క్రేజ్ త‌గ్గ‌లేదు. దీనికి కార‌ణం ఇమ్మాన్యూయేల్ అందం, త‌న ప్ర‌వ‌ర్త‌నే అంటున్నారు కొంద‌రు. అమెరికా నుంచి వ‌చ్చిన ఈ క‌థానాయిక‌కు ఎలాంటి ఇగో గాని, స్పెష‌ల్ డిమాండ్స్‌గాని చేయ‌ద‌ని... అలాగే ఎక్కువ ఖ‌ర్చు చేయ‌కుండా సినిమా ముగిస్తుందంటూ....అందుకొస‌మే అవ‌కాశాలు వ‌స్తున్నాయ‌ని ఫిల్మ్ నగర్ లో కొందరు నిర్మాతలు చెబుతున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.