అనుపమ కెరీర్ రిస్క్ లో ఉందా ?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

heroine anupama parameswaran
Updated:  2018-08-04 03:34:16

అనుపమ కెరీర్ రిస్క్ లో ఉందా ?

మలయాళం సినిమా అయిన "ప్రేమం" తో సౌత్ మొత్తం లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ సినిమా తరువాత తెలుగు లో వరుస అవకాశాలు తెచ్చుకుంది అనుపమ పరమేశ్వరన్. కానీ ఇప్పటి వరకు అనుపమ మాత్రం ఒక భారీ హిట్ అందుకోలేకపోయింది. అనుపమ గత చిత్రాలు అయిన "ఉన్నదీ ఒక్కటే జిందగీ" "తేజ్ ఐ లవ్ యు" ఈ రెండు సినిమాలు భారి ఫ్లాప్ గా నిలిచాయి.
 
దాంతో అనుపమకు తన సెలెక్షన్‌ మీద అనుమానం వస్తోందట. ఎలాంటి క్యారెక్టర్స్‌ని ఎంచుకోవాలో తెలియని కన్‌ఫ్యూజన్‌లో ఉందంట అనుపమ. ఓ సినిమాని ఎంచుకునేటప్పుడు తన అభిప్రాయంతో పాటు, తన సన్నిహితుల అభిప్రాయం కూడా తీసుకుంటుందట. కానీ ఎందుకో ఈ మధ్య మాత్రం సరైన కథలు ఎన్నుకోవట్లేదు అనే ఫీలింగ్ లో ఉంది అనుపమ.
 
కానీ తాజాగా అనుపమా పరమేశ్వరన్‌ ఓ క్రేజీ ప్రాజెక్టుపై సైన్‌ చేసింది అని టాక్. కన్నడ బాషలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ లో అనుపమ లాయర్ పాత్రలో నటిస్తుంది. అలాగే ప్రస్తుతం తెలుగు లో రామ్ తో కలిసి "హలో గురు ప్రేమకోసమే" అనే సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.