ప్రకాష్ రాజ్ తో గొడవ పై షాకింగ్ కామెంట్స్ చేసిన అనుపమ పరమేశ్వరన్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

prakash raj and anupama
Updated:  2018-10-22 11:38:20

ప్రకాష్ రాజ్ తో గొడవ పై షాకింగ్ కామెంట్స్ చేసిన అనుపమ పరమేశ్వరన్

అనుపమ పరమేశ్వరన్ ఈ మధ్యనే హలో గురు ప్రేమకోసమే సినిమాలో రామ్ సరసన నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బాగానే హడావిడి చేస్తోంది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ అనుపమ తండ్రి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నంత కాలం అనుపమకు ప్రకాష్ రాజ్ కు మధ్య గొడవలు అయ్యాయి అని ఒకరోజు ప్రకాష్ రాజ్ కోపంగా అనుపమ ను తిట్టేశారు అని పుకార్లు బయటకొచ్చాయి. ఈ విషయమై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది అనుపమ. ఓసారి అనారోగ్యం పాలై హాస్పిటల్ కి వెళ్లొచ్చాను. ఆ మరుసటి రోజు నుండి ఇలాంటి వార్తలు వచ్చాయి. అరే ఇదేంటి..? ఇలా వార్తలొచ్చాయి అని అనుకున్నా. అస్సలు ఆయనకు దీంతో ఏ సంబంధమూ లేదు పాపం..! అనేసింది.

అంతే కాక ప్రకాష్ రాజ్ గారితో తాను రెండోసారి పనిచేస్తున్నానని, శతమానం భవతి చిత్రంలో ఆయన తాతగారు. హలో గురూ చిత్రంలో తండ్రి పాత్రలో నటించారు. తరువాత బోయ్ ఫ్రెండ్ గా చేస్తారేమో" అంటూ నవ్వేసింది అనుపమ. ఇక ప్రకాష్ రాజ్ గారి నుంచి మనం ఎంతైనా నేర్చుకోవచ్చు అని చెప్పుకొస్తోంది. మరి నిజ జీవితంలో ఆమె ఫాదర్ కి ప్రకాష్ రాజ్ కి తేడా ఏమిటి అని అడిగితే, అలాంటి పరిస్థితుల్లో మా నాన్న ఎలా రియాక్ట్ ఆవుతారో నాకు తెలియదు. కానీ స్క్రీన్ మీద ఫాదర్ మాత్రం ఓపెన్ మైండెడ్, బ్రాడ్ మైండెడ్ అంటూ చెప్పుకొచ్చింది. కానీ కాస్త తడిపొడిగానే సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది.

షేర్ :

Comments

0 Comment