బాలీవుడ్ లో మరో మలయాళీ ముద్దుగుమ్మ

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

tollywood and bollywood
Updated:  2018-09-08 06:07:14

బాలీవుడ్ లో మరో మలయాళీ ముద్దుగుమ్మ

మలయాళం ముద్దుగుమ్మలు తెలుగునాట సెటిల్ అవ్వడం కొత్తేమికాదు. అనాదిగా వస్తున్న ఆచారమే. ఆ కోవలోకే ఇప్పుడు మరో బ్యూటీ చేరనుంది. ‘ప్రేమమ్‌' సినిమాలో నాగచైతన్య సరసన నటించిన బ్యూటీబీ అనుపమా పరమేశ్వరన్‌.
 
'అ,ఆ'లో ఇంపార్టెంట్‌ రోల్‌ పోషించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. 'శతమానం భవతి' సినిమాతో సూపర్‌ హిట్‌ కొట్టి, మన పక్కింట్లో ఉండే అమ్మాయి అయిపోయింది. ఆ తర్వాత అనుపమా వరుసగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. 'ఉన్నది ఒక్కటే జిందగీ', 'తేజ్‌ ఐ లవ్‌యూ' చిత్రాలు అనుపమకి అంతగా కలిసి రాలేదు. 
 
ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణం లో రామ్‌తో 'హలో గురూ ప్రేమ కోసమే' సినిమాలో నటిస్తోంది. దసరా పండగ విడుదలకు ఈ చిత్రం సన్నద్ధం అవుతుంది. సౌత్ ఇండియన్ భాషలలో మంచి పేరు సాధించిన ఈ ముద్దు గుమ్మ ఇప్పడు మరో భాష వైపు కన్నేసింది.తాను  త్వరలోనే హిందీలో కూడా నటించబోతున్న విషయం ఈ మధ్యే తెలిపింది. ఈ పాపకి బాలీవుడ్ నుండి అవకాశాలు వస్తున్నాయట. ఎన్ని వచ్చిన టాలీవుడ్ మాత్రం ముందు ఉంటుంది అంటూ ఇక్కడి దర్శకనిర్మాతలకు కూడా ఒక గేలం వేసి పడేసింది.
 
ఎలాంటి పాత్రల్లో నటిస్తున్నారు అణా ప్రశ్నకు బదులుగా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను మాత్రమే నేను ఎంచుకుంటాను అది ఏ భాష అయినా సరే అని నిర్మొహమాటంగా చెప్పేస్తుందంటా.