బికినీల పై అనుప‌మ క్లారిటీ

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

anupama parameswaran image
Updated:  2018-02-28 11:06:18

బికినీల పై అనుప‌మ క్లారిటీ

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో గ‌త కొద్ది కాలంగా ద‌క్షిణాది భామ‌ల హ‌వా కొన‌సాగుతోంది... వ‌చ్చిన అవ‌కాశాల‌ను రిజ‌క్ట్   చేయ‌కుండా వినియోగించుకుంటూ త‌న‌దైన శైలిలో న‌టిస్తూ తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్నారు ఆ ముద్దుగుమ్మ‌లు... వీరందరూ అగ్ర హీరోయిన్ ల జాబితాలో చేర‌లేదేమో కానీ, మ‌ధ్య శ్రేణి హీరోయిన్ లు మాత్రం మోస్ట్ వాంటెడ్ అయిపోతున్నారు ద‌క్షిణాది భామ‌లు... వారి స‌ర‌స‌న న‌టించిన చిత్రాల‌కు వారి మాట‌ల‌కు వారే డ‌బ్బింగ్ చెప్పుకుంటూ అతి త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్ లో వ‌రుస అవ‌కాశాల‌ను ద‌క్కించుకుంటున్నారు ఈ వ‌య్యారి భామ‌లు.
 
అయితే అలాంటి జాబితాలో చేరిన వారిలో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ఒక‌రు... తెలుగు ఇండ‌స్ట్రీకి !!ఆఆ!! చిత్రం ద్వారా ప‌రిచ‌య‌మ‌య్యారు అనుప‌మ‌.... ఆ త‌ర్వాత శ‌త‌మానం భ‌వ‌తి, ప్రేమ‌మ్. ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ.
 
అయితే తాజాగా ఈమె ఓ ప్ర‌ముఖ ఛాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూ లో తాను న‌టించ‌బోయే సినిమాల‌పై స్పందించారు  త‌న‌కు న‌చ్చిన క‌థ‌ల‌ను మాత్రమే ఓకే చేస్తాన‌ని, వ‌చ్చిన ప్ర‌తీ ఆఫ‌ర్ నీ ఓకే చేసుకుంటూ పోతే త‌న కెరియ‌ర్ దెబ్బ‌తింటుంద‌న్న భ‌యంతో ఈ ముద్దుగుమ్మ ఆచి తూచి అడుగు వేస్తున్నార‌ట‌.
 
అందులో భాగంగానే తెలుగు ప్రేక్ష‌కుల‌కు గ్లామ‌ర్ ను ఎలా చూపించాలో త‌న‌కు తెలుస‌ని అన్నారు... అంద‌రి హీరోయిన్ ల లాగా తాను కూడా గ్లామ‌ర్ షోల‌కు వెళ్ల‌న‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు చెప్పింది అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్.త‌న‌కు త‌న అభిమానుల పై న‌మ్మ‌కం ఉంద‌ని, అలాగే  వెండితెర‌పై ఎలా క‌నిపించాలో త‌న‌కు ఆ విష‌యంపై బాగా అవ‌గాహ‌న ఉంద‌ని చెప్పారు అనుప‌మ‌.. అయితే రానున్న సినిమాల‌లో తాను  బికినీలు వేసే ప్రసక్తే లేదని, తన కండిషన్స్‌కి ఓకే అన్న సినిమాలే చేస్తాను తప్ప ఈ పద్ధతి ఎప్పటికీ మార్చుకోనని కుండ బద్దలు కొట్టేసింది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.