మెగా స్టార్ సరసన రొమాన్స్ చేయడానికి సిద్ధం అయిన అనుష్క

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

chiranjeevi and anushka
Updated:  2018-08-08 03:26:03

మెగా స్టార్ సరసన రొమాన్స్ చేయడానికి సిద్ధం అయిన అనుష్క

మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం "సై రా నరసింహారెడ్డి" సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని రామ్ చరణ్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు.

కొరటాల శివ తీసిన సినిమాలు అన్నీ ఇప్పటి వరకు భారీ హిట్స్ గా నిలిచాయి అందుకే స్టార్స్ అందరూ కొరటాల శివకి ఆఫర్స్ ఇవ్వడానికి రెడీ గా ఉన్నారు అందుకే మెగాస్టార్ కూడా కొరటాల శివకి ఆఫర్ ఇచ్చాడు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా లో చిరు సరసన అనుష్క నటించబోతుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ, ఈ విషయం పై ఇంకా ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రాలేదు.

ఇదివరకు అనుష్క, మెగా స్టార్ చిరంజీవితో కలిసి "స్టాలిన్" సినిమాలో ఐటెం సాంగ్ చేసింది. ఇదిలా ఉంటె కొరటాల శివ చిరంజీవి కోసం ఒక పక్కా కమర్షియల్ కథని రెడీ చేసాడు అంట. "సై రా" షూటింగ్ అయిపోగానే ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతాడు మెగా స్టార్.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.