ఆ పని చేయ‌లేనంటున్న అనుష్క

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-02-08 05:00:58

ఆ పని చేయ‌లేనంటున్న అనుష్క

ద‌క్షిణాది నుంచి వ‌చ్చి తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో సెటిల్ అవుతున్నారు కొంత‌మంది న‌టీ మ‌ణులు... టాలీవుడ్ లో అడుగు పెట్టాక వ‌చ్చిన ప్ర‌తీ  అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుంటున్నారు కేర‌ళ భామ‌లు... అయితే ఈ క్ర‌మంలో వారు న‌టించిన‌ది తెలుగులో కొన్ని చిత్రాలే అయినా, కానీ వారి మాట‌ల‌కు వారే డబ్బింగ్ చెప్పుకుంటూ ప్ర‌స్తుతం టాలీవుడ్ లో వ‌రుస అవ‌కాశాలను ద‌క్కించుకుంటున్నారు కేర‌ళ భామ‌లు.
 
తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టి సుమారు యాబైకి పైగా సినిమాల‌లో న‌టించారు క‌న్న‌డ బ్యూటీ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి... అయితే ఈ అమ్మ‌డు తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు వ‌చ్చి  ప‌ద‌మూడు సంవ‌త్స‌రాలు కావ‌స్తున్నా ఇంత‌వ‌ర‌కు ఒక్క సినిమాకు కూడా డ‌బ్బింగ్ చెప్ప‌లేదు.
 
ఇటీవ‌ల త‌న సినిమాల‌కు డ‌బ్బింగ్ చెప్ప‌క‌పోవ‌డానికి  కార‌ణం చెప్పింది అనుష్క.. తాను డ‌బ్బింగ్ చెబితే చిన్న పిల్ల‌ల గొంతు మాదిరిగా వినిపిస్తుంది అని , అందుకే తాను న‌టించిన సినిమాల‌కు డ‌బ్బింగ్ చెప్ప‌లేద‌ని అన్నారు... ఇదే విష‌యాన్ని త‌న కుటుంబ స‌భ్యులు అనేక సార్లు చెప్పార‌ని, అందుకోస‌మే తాను న‌టించే సినిమాల‌లో డ‌బ్బింగ్ చెప్ప‌న‌ని చెప్పారు... అరుంధతి సినిమాలోకూడా  !! నువ్వు నన్నేం చేయలేవురా అనే డైలాగ్ ని చాలా సార్లు క‌ష్ట‌ప‌డి  ప్రాక్టీస్ చేశాన‌ని అన్నారు అనుష్క.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.