అనుష్క పెళ్లి అత‌నితో ఫిక్స్ అయిన‌ట్టే ?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-06-28 17:28:23

అనుష్క పెళ్లి అత‌నితో ఫిక్స్ అయిన‌ట్టే ?

టాలీవుడ్ లో  హీరోలు హీరోయిన్ల పెళ్లిళ్ల గురించి వార్త‌లు రావ‌డం స‌హ‌జం.. అలాగే ప‌లువురి పెళ్లిళ్ల పై వార్త‌లు వినిపించ‌డం వారు దీనిని క‌రెక్ట్ అయితే ఒప్ప‌కోవ‌డం.. లేదు అంటూ దానిని కొట్టిపారేయ‌డం జ‌రుగుతుంది.. ఇటు శ్రియ నుంచి అనుష్క వ‌ర‌కూ అంద‌రికి ఇదే ఇబ్బంది ఎదురైంది.. గ‌తంలో హీరోయిన్  అనుష్క గురించి టాలీవుడ్ లో ఎన్నో వార్త‌లు వినిపించాయి.. ముందుగా  టాలీవుడ్ యంగ్ హీరోతో ఆమె ల‌వ్ లో ఉంద‌ని ఆ హీరోతో  ఆమెకు వివాహాం జ‌రుగుతుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి.
 
త‌ర్వాత ప్ర‌భాస్ అనుష్క పెళ్లి చేసుకుంటున్నారు అని ల‌వ్ లో ఉన్నారు అని వార్త‌లు వినిపించాయి. చివ‌ర‌కు ప్ర‌భాస్ అనుష్క మా మ‌ధ్య ఏమీ లేద‌ని ఎక్కువ సినిమాలు క‌లిసిన‌టించ‌డం వ‌ల్ల మంచి ఫ్రెండ్ షిప్ ఏర్ప‌డింది అంతే కాని మేము రిలేష‌న్ లోలేము అని అనేక సార్లు వీరిద్ద‌రూ మీడియాలో తెలియ‌చేశారు.
 
అయితే ఆమె పెళ్లి ఎలా ఉన్నా ఆమె పెళ్లిని మాత్రం వంద సార్లు మీడియాలు చేసేశాయి..ఇక ప్ర‌తీసారి ఆమె పెళ్లి వార్త‌ల‌పై స్పందించ‌డం అవి రూమ‌ర్లు అని కొట్టిపారేయ‌డం జ‌రిగింది.. అయితే ఇటీవ‌ల ఆమె పై ఓ స‌రికొత్త వార్త ఇటు టాలీవుడ్ కోలీవుడ్ లో వినిపిస్తోంది. దేవ‌సేన‌కు పెళ్లి చేసేందుకు ఇంట్లో ఆమె కుటుంబ స‌భ్యులు నిర్ణ‌యించార‌ట‌. స్వీటీ పెళ్లి ఈ ఏడాది జ‌ర‌గ‌డం ఖాయం అని వార్త‌లు వినిపిస్తున్నాయి.
 
ఇక ఆ వ‌రుడు కూడా ఆమె కుటుంబ స‌భ్యుల‌కు న‌చ్చ‌డం, త‌ర్వాత దేవ‌సేన‌కు న‌చ్చ‌డంతో ఆమె కూడా పెళ్లికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిందట‌. అనుష్క‌కు కాబోయే భ‌ర్త దుబాయ్ లో వ్యాపారాలు చేస్తున్నాడ‌ట.. ఇక ఆ బిజినెస్ మ్యాన్ తో ఆమె పెళ్లి ఈ ఏడాది జ‌రుగుతుంది అని ఇటు ఆమె స‌న్నిహితులు కూడా అంటున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.