ప్రభాస్ తో పెళ్లిపై అనుష్క క్లారిటీ

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-01-21 12:27:38

ప్రభాస్ తో పెళ్లిపై అనుష్క క్లారిటీ

బాహుబ‌లి-2  సినిమాతో  ప్ర‌భాస్, అనుష్క జంట దేశ‌వ్యాప్తంగా మంచి పాపుల‌ర్ అయింది. అయితే వీరిద్ద‌రి గురించి ఓ వార్త సోష‌ల్ మీడియాలో  పెద్ద వైర‌ల్ గా మారింది.    ప్ర‌భాస్  , అనుష్క మ‌ధ్య  ప్రేమాయ‌ణం న‌డుస్తోంద‌ని , వీరు త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోతున్నార‌ని   సోష‌ల్ మీడియాలో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది  . బాహుబ‌లి   సినిమా  స‌మ‌యంలో  వీరిద్ద‌రి మ‌ధ్య ప్రేమ చిగురించింద‌ని ,చాలా క్లోజ్ అయిపోయార‌ని  పుకార్లు షికార్లు చేస్తున్నాయి. .

వీరిద్ద‌రి పెళ్లికి ప్ర‌భాస్ పెద్ద‌నాన్న కృష్ణంరాజు కూడా అంగీక‌రించార‌ని త్వ‌ర‌లోనే పెళ్లి ఉంటుంద‌నే వార్త‌లు హాట్ టాపిక్ గా మారాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌భాస్ తో ఉన్న సంబంధంపై అనుష్క స్పందించారు. తామిద్ద‌రం మంచి స్నేహితులం మాత్ర‌మేన‌ని, ఆమె క్లారిటీ ఇచ్చారు.  ప్ర‌భాస్ తాను తెర‌పై మంచి జోడీ అని అనుష్క చెప్పారు.

ప్ర‌భాస్ ,అనుష్క క‌లిసి ఇప్ప‌టికే నాలుగు సినిమాల్లో న‌టించారు. తాజాగా  ప్ర‌భాస్ న‌టిస్తున్న సాహో సినిమాలో కూడా  అనుష్క  హీరోయిన్ గా న‌టించ‌నుంది అనే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు హీరోయిన్ గా ప్ర‌భాస్ , అనుష్క ను సిఫార్స్ చేశారని, టాలీవుడ్ స‌ర్కిల్స్ లో వార్త‌లు వినిపిస్తున్నాయి..

 

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.