అనుష్క విదేశాల‌కు జంప్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-10-10 17:46:06

అనుష్క విదేశాల‌కు జంప్

గ్లామరస్ రోల్స్ అయినా, లేడీ ఓరియంటెడ్ సినిమా లైనా టాలీవుడ్ లో అనుష్కనే దర్శక నిర్మాతలకు మొదటి ఆప్షన్ గా ఉండేది. కానీ సైజ్ జీరో కోసం కష్టపడి బరువు పెరిగిన అనుష్క సినిమా తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా తగ్గలేకపోయింది.  అందువల్ల ఆమెకు ఆఫర్లు భారీగా తగ్గిపోయాయి. ఈమె క్రేజ్ ఒక రేంజిలో ఉన్నా బరువు కారణంగా దర్శకనిర్మాతలు ఈమెపై ఆసక్తి చూపడం మానేశారు. అనుష్క ఆఖరుగా భాగమతి సినిమా తో బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ అందుకుంది కాని తరువాత ఒక్క ప్రాజెక్ట్ ను కూడా సైన్ చేయలేదు.
 
ఇక లావుగా ఉన్న కారణం తో ప్రభాస్ నటిస్తున్న సాహో సినిమాలో నటించే అవకాశం కోల్పోయిన అనుష్క బోలెడు హెల్త్ సెంటర్ చుట్టూ తిరుగుతోందట. స్నేహితుల ద్వారా ఆస్ట్రియా లో ఉన్న ఒక క్లినిక్లో కేవలం సహజసిద్ధమైన పద్ధతుల ద్వారానే బరువు తగ్గుతారట అని తెలుసుకుంది. ఇది విన్న వెంటనే వైద్యం చేయించుకోవడం కోసం అనుష్క ఆస్ట్రియా వెళ్ళటానికి సిద్ధం అవుతోంది. అనుష్క ఇప్పటికైనా బరువు తగ్గి కొత్త ఆఫర్ లను చేజిక్కించుకుంటుందా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది. ఇది తెలియాలంటే, ట్రీట్మెంట్ పూర్తయ్యేవరకు ఎదురు చూడాల్సిందే.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.