నేను ఆత్మహత్య కి ప్రయత్నించా ..ఎ.ఆర్ రెహమాన్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

ar rahman
Updated:  2018-11-05 12:27:14

నేను ఆత్మహత్య కి ప్రయత్నించా ..ఎ.ఆర్ రెహమాన్

ఎ.ఆర్ రెహమాన్ ఈ పేరుకి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. తన సంగీతం తో ప్రపంచాన్ని ఉర్రుతలుగించిన సంగీత మాంత్రికుడు రెహమాన్. రెండు ఆస్కార్ అవార్డులతో పాటు, ప్రపంచ స్థాయిలో పలు అవార్డులు అందుకోని, ప్రపంచ నలుదిశలా భారతీయ పేరు ప్రఖ్యాతులు ఎగురవేసిన మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్. సంగీత ప్రియులు ఈయన పాటలకు చెవి కోసుకుంటారు అంటే అది ఏ మాత్రం అతిశయోక్తి కాదు.

అయితే ఇది మాత్రమే రెహమాన్ గురించి ప్రపంచం మొత్తం తెలిసిన విషయం. తన గురించి తెలియని విషయాలు ఇంటర్వ్యూ సందర్భంగా మీడియా తో పంచుకున్నాడు రెహమాన్. ఒకానొక దశలో తను ఆత్మహత్య చేసుకోవలనుకున్నా అని, ఒకసారి ప్రయత్నించా కూడా అని చెప్పాడు రెహ్మాన్. రోజా సినిమా ముందు తన కుటుంబం కటిక బీదరికం లో ఉండేది అని, తినడానికి తిండి కూడా ఉండేది కాదు అని, అప్పుడు మతం మార్చుకొని ఇస్లాం లోకి వచ్చాము అని.

దిలీప్ కుమార్ గా ఉండే నా పేరుని రెహమాన్ గా మార్చుకున్నా అని చెప్పుకొచ్చాడు. అప్పట్లో దిలీప్ అని ఎవరైనా పిలిస్తే నచ్చేది కాదు అని ఈ ఇంటర్వ్యూలో చెప్పాడు. అందరికి ఏదో దశలో ఆత్మహత్య అనే పరిస్థితి ఎదురవుతోంది అని, ఆ దశ దాటితే కొత్త జీవితం కనబడుతుంది అని ఈ సందర్భంగా చెప్పాడు రెహమాన్.

షేర్ :

Comments

0 Comment