బిజీగా ఉన్న ఎన్టీఆర్..తొందరపడుతున్న త్రివిక్రమ్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-08-02 12:39:08

బిజీగా ఉన్న ఎన్టీఆర్..తొందరపడుతున్న త్రివిక్రమ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇంకా త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా "అరవింద సమేత". ఈ సినిమా యొక్క షూటింగ్ ప్రస్తుతం హైదరబాద్ లో శర వేగంగా సాగుతుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంభందించిన క్లైమాక్స్ షూటింగ్ లో మూవీ యూనిట్ మొత్తం బిజీగా ఉన్నారు.
 
ఎన్టీఆర్ ని ఈ సినిమాలో చాలా కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడట త్రివిక్రమ్. అలాగే మూవీ లో వచ్చే ఫైట్ సీన్స్ ని కూడా చాలా స్టైలిష్ గా తెరకేక్కిస్తున్నాడు అని తెలుస్తుంది. ఇదిలా ఉంటె ఇంకో 40 రోజుల్లో ఈ సినిమాకి సంభందించిన షూటింగ్ మొత్తం పూర్తవుతుంది అని సమాచారం. 
 
సెప్టెంబర్ 15 తరువాత ఫారిన్ లో ఒక్క సాంగ్ ని షూట్ చేసి ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ అయిపోతారు టీం. ఇకపోతే ఎన్టీఆర్ మాత్రం ఈ సినిమాలో వచ్చే ఎమోషనల్ సీన్స్ ని బాగా పండించాడు అని ఫిలిం నగర్ టాక్. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి ఎస్.ఎస్.తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.