లీక్ అయినా అరవింద సమేత షూటింగ్ దృశ్యం

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

aravinda sametha photo
Updated:  2018-07-24 01:04:32

లీక్ అయినా అరవింద సమేత షూటింగ్ దృశ్యం

యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రముఖ రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం “అరవింద సమేత”. ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ పై కె.రాధాకృష్ణ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో బిజీగా ఉన్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, తెలుగు భామ ఈషారెబ్బ మరో కీలకమైన పాత్రలో కనిపిస్తుంది.
 
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం నుండి ఒక ఆసక్తికర పిక్ లీక్ అయ్యింది, ఈ పిక్ లో యాంగ్ టైగర్ ఎన్టీఆర్ తో పాటు నాగబాబు ఉండడం విశేషం, ఇక ఈ పిక్ లో రక్తపు మడుగులో ఉన్న నాగబాబు ను తదేకంగా చూస్తున్న ఎన్టీఆర్ కనిపిస్తున్నారు. పూర్తిస్థాయి రాయలసీమ కథగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగబాబు ఎన్టీఆర్ తండ్రిగా నటిస్తున్నారు.
 
సినిమాలో అతి కీలకమైన ఫైట్ లోని సన్నివేశంగా తెలుస్తోంది. అయితే ఈ పిక్ ని ఎవరు లీక్ చేసి ఉంటారు అనే విషయం ఇంకా తెలియలేపోవడంతో చిత్ర బృందం ఆ లీక్ చేసిన వ్యక్తిని కనుకునే పనిలో ఉంది, ఇదిలా ఉండగా జరగాల్సిన నష్టం ఎటు జరిగిపోయూయింది కనుక ఇక నుంచైనా ఇలాంటి లీక్ లను అరికట్టేవిధంగా షూటింగ్ లో కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు సినీ ప్రేమికులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.