అరవింద సమేత ట్రైలర్ రివ్యూ

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

aravinda sametha
Updated:  2018-10-03 11:04:07

అరవింద సమేత ట్రైలర్ రివ్యూ

అరవింద సమేత వీర రాఘవ ప్రి రిలీజ్ ఫంక్షన్ నిన్న‌ జరిగింది. ఫంక్షన్ లో భాగంగా థియేట్రికల్ ట్రైలర్ ని లాంచ్ చెయ్యడం జరిగింది. ఈ ట్రైలర్ నిడివి రెండు నిముషాల పదకొండు సెకన్లు (2:11) . ట్రైలర్ ఎలా ఉంది అంటే..? స్టార్టింగ్ హీరో, హీరోయిన్ లవ్ ట్రాక్ చూపిస్తూనే హీరోయిన్ అడిగిన ఒక్క ప్రశ్న తో వైలెన్సు లోకి తీస్కెళ్ళిపోయాడు త్రివిక్రమ్, సెంటిమెంట్, యాక్షన్ సీన్స్ పుష్కలంగా ఉండేలా ఉన్నాయి..

ఈ ట్రైలర్ చూస్తుంటే.. ''ముప్పై ఏండ్ల నాడు మీ తాత కత్తి పట్టినడంటే" అనే డైలాగ్ త్రివిక్రమ్ కాలం మార్క్ కనిపించింది, ఇక ట్రైలర్ లో ప్రధాన ఆకర్షణగా జగపతి బాబు వేషధారణ, సునీల్ ఒకే ఒక్క ఫ్రేమ్ లో చూపించి సునీల్ పాత్ర పై పూర్తి క్లారిటీ రాకుండా చేసి సస్పెన్స్ ఇచ్చాడు త్రివిక్రమ్.. తారక్ నుండి ఎమోషనల్ యాక్షన్ డ్రామా ని చూడబోతున్నాం అనిపించే విధంగా ఉంది ట్రైలర్. 

రాయలసీమ ప్రాంతం లో వారసత్వంగా వస్తున్న ఫ్యాక్షన్ గోడవల్ని అంతం చేసి ప్రేమ ని పంచే కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా ని చూస్తుంటే..కథకి మూలం మిర్చి సినిమా నా అన్నట్టుగా కూడా కొంతమందికి అనిపించకపోదు, ఏమో ఏం జరగొచ్చో రిలీజ్ అయ్యేవరకు చెప్పలేం కాబట్టి దసరా వరకు వేచి చూడాల్సిందే.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.