రకుల్ పై దాడి

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-10-11 04:26:24

రకుల్ పై దాడి

బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఎన్టీఆర్ బయోపిక్ లో రకుల్ ప్రీత్ సింగ్, అతిలోక సుందరి శ్రీదేవి పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. రకుల్ పుట్టినరోజు సందర్భంగా సినిమాలో ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు దర్శకనిర్మాతలు. అందరూ రకుల్ శ్రీదేవి గా ఆదరగొటేసిందని కామెంట్స్ చేస్తోంటే, కొందరు మాత్రం ఆమెను ట్రోల్ చేస్తున్నారు.

రకుల్ శ్రీ దేవి లా కాదు శ్రీ రెడ్డి లా ఉంది అంటూ వ్యంగ్యమాడుతున్నారు. ఈ సంగతి పక్కన పెడితే, గతంలో రకుల్ ప్రీత్ క్యాస్టింగ్ కౌచ్ లాంటివి తనకైతే ఎదురవ్వలేదు అని చెప్పినప్పుడు శ్రీ రెడ్డి ఆమెపై విరుచుకుపడింది.అసలు రకుల్ లాంటి హీరోయిన్ల వల్లే తెలుగు డైరెక్టర్లు తెలుగు హీరోయిన్ల మొహాలు చూడట్లేదని, వాళ్ళ చుట్టూనే తిరుగుతున్నారని చాలానే ఘాటు వ్యాఖ్యలు చేసింది శ్రీ రెడ్డి.

ఇక ఆమె లా ఉన్నావు అనడంతో రకుల్ కూడా బాధపడినట్టే ఉంది.  ఏదేమైనా శ్రీ దేవి లాంటి గొప్ప నటి పాత్రలో కనిపించే అదృష్టం అందరికీ రాదు కానీ రకుల్ కు వచ్చింది. ఇక ట్రోల్ చేసేవారికి ఆమె శ్రీ దేవి లా కనిపించినా  కనపడకపోయినా చిత్రబృందానికి రకుల్ పై ఉన్న నమ్మకం అయితే పోదు కాబట్టి ఇవన్నీ ఆమె పెద్దగా పాటించుకోవట్లేదట.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.