తార‌క్ అభిమానుల‌కు చేదు వార్త‌

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-02-17 05:54:27

తార‌క్ అభిమానుల‌కు చేదు వార్త‌

నిన్ను చూడాల‌ని సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌య‌మైన హీరో యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌. త‌న న‌ట‌న, ప్ర‌తిభ‌తో వెండితెర పై  వ‌రుస విజ‌యాలు సాధిస్తూ.... త‌న‌దైన శైలిలో దూసుకుపోతున్నారు. జూనియ‌ర్ ఎన్టీఆర్ వాక్చాతుర్యాన్ని ఇష్ట‌ప‌డ‌నివారు ఎవ‌రూ ఉండ‌రంటే అతిశ‌యోక్తి లేదు. ఎన్టీఆర్‌కు ఉన్న ఫాలోయింగ్  గ‌మ‌నించిన స్టార్ మాటీవి బిగ్‌బాస్ షోకు వ్యాఖ్యాత‌గా నియ‌మించింది. దీంతో బిగ్‌బాస్ షో ఘ‌నవిజ‌యం సాధించింది.త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే బిగ్‌బాస్‌-2 సీజ‌న్‌ను కూడా ఎన్టీఆర్ చేతే హోస్ట్ చేయించాల‌ని నిర్వాహ‌కులు భావిస్తున్నారు.
 
అయితే ఇటీవ‌ల జైల‌వ‌కుశ‌ సినిమా ఘ‌న విజ‌యంతో  కొంత విరామం తీసుకున్నారు తార‌క్‌. ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్‌తో చేయ‌బోయే సినిమా కోసం సిద్దం అవుతున్నారు జూనియ‌ర్. ఈ చిత్రం పూర్తి అయిన త‌ర్వాత రాజ‌మౌళి డైరెక్ష‌న్‌లో ఓ మల్టీస్టార‌ర్ సినిమా చేయ‌బోతున్న‌ట్టు ప్రచారం సాగుతోంది. ఇంత బిజి ష్యెడ్యూల్లో బిగ్‌బాస్ షో వ్యాఖ్య‌త బాధ్య‌త‌లు స్వీక‌రించ‌డానికి ఎన్టీఆర్‌కు స‌మ‌యం లేదు.
 
తాజాగా ఈ సీజ‌న్‌ కోసం ఎన్టీఆర్‌ను నిర్వాహ‌కులు సంప్ర‌దించార‌ట‌. అయితే ఇప్ప‌టికే అంగీక‌రించిన‌ సినిమాలు, ఫ్యామిలీ క‌మిట్‌మెంట్స్ కార‌ణంగా  ఈ కార్య‌క్ర‌మం చేయ‌లేనని ఎన్టీఆర్ నిర్వాహ‌కులు చెప్పిన‌ట్టు తెలుస్తోంది.  ఇదే జ‌రిగితే బిగ్ బాస్ 2 షోలో ఎన్టీఆర్ స్ధానాన్ని ఎవ‌రు భ‌ర్తీ  చేస్తారో చూడాలి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.