నవంబర్ నుంచి సెట్స్ పైకి బాలకృష్ణ బోయపాటి సినిమా

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-07-13 12:34:21

నవంబర్ నుంచి సెట్స్ పైకి బాలకృష్ణ బోయపాటి సినిమా

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అతి పెద్ద హిట్స్ గా నిలిచినా సినిమాలు "సింహ" ఇంకా "లెజెండ్". బాలకృష్ణ ఇంకా బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాలు భారీ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఈ రెండు సినిమాల తరువాత వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే మూడో సినిమా కోసం చాలా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు.

యితే త్వరలో వీళ్ళ కాంబినేషన్ లో ఒక సినిమా ఉండనుంది అట. ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న "ఎన్టీఆర్" బయోపిక్ సినిమాని అక్టోబర్ లో పూర్తి చేసి నవంబర్ నుంచి బోయపాటి సినిమా మొదలుపెట్టాలాని చూస్తున్నాడు అంట బాలకృష్ణ. "సింహ" "లెజెండ్" తర్వాత రాబోతున్న ఈ క్రేజీ సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి.

మరి రెండు సార్లు బాలకృష్ణ మంచి మాస్ క్యారెక్టర్ లో చూపించిన బోయపాటి మూడో సినిమాలో బాలక్రిష్ణని ఎలా చూపిస్తాడు అని ఎదురుచూస్తున్నారు అంతా. ఇదిలా ఉంటే బోయపాటి శ్రీను ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఒక సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యాక బాలయ్య బాబు సినిమా స్క్రిప్ట్ మీద కూర్చుంటాడు బోయపాటి శ్రీను.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.