కరుణ మృతిపై స్పందించిన బాలకృష్ణ

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

karunanidhi and balakrishna
Updated:  2018-08-09 05:20:59

కరుణ మృతిపై స్పందించిన బాలకృష్ణ

డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే, ఆయన మృతిపై దేశ రాజయకీయనేతలతో  పాటుగా సినీ ప్రముఖులు, నటులు కూడా తీవ్ర దిగ్రాంతి వ్యక్తం చేశారు.
 
తాజాగా కరుణానిధి మృతిపై ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ స్పందించారు, కరుణానిధి మృతి సాహిత్య రంగానికి తీరని లోటు అని తెలిపిన బాలయ్య, తన ట్విట్టర్ ఖాతా ద్వారా "కరుణానిధి మరణం రాజకీయాలకు మాత్రమే కాదు చిత్రసీమకు కూడా తీరని లోటు. నాన్నగారితో ఆయనకు విశేషమైన అనుబంధం ఉండేది.
 
80 ఏళ్ల రాజకీయ అనుభవం, 5 సార్లు ముఖ్యమంత్రిగా, 13 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం మాములు విషయం కాదు. అటువంటి రాజకీయ చరిత్ర కల్గిన మహానుభావుడు నేడు మన మధ్య లేకపోవడం బాధాకరం. ఆయన లోటు తీర్చలేనిది, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అని బాలకృష్ణ తెలిపారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.