బాల‌య్య ఎన్టీఆర్ బ‌యోపిక్ హాడ్ ఇచ్చాడు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

ntr bio pic balakrishna
Updated:  2018-06-16 01:55:46

బాల‌య్య ఎన్టీఆర్ బ‌యోపిక్ హాడ్ ఇచ్చాడు

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 104వ సినిమాకు రంగం సిద్ధం అయింది.  గ‌త ఎడాది వచ్చిన‌ పైసా వసూల్ సినిమా బాక్సాఫీస్ ముందు ప్రేక్ష‌కుల‌ను పెద్ద‌గా ఆల‌రించ‌లేక పోయింది. ఇక త‌న తండ్రిపాత్ర‌లో న‌టించి ప్రేక్ష‌కుల‌ను అల‌రించాల‌ని చూస్తున్నారు.అయితే ఈ చిత్రానికి మొద‌ట్లో తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కానీ కొన్ని అనివార్య‌కార‌ణాల‌వ‌ల్ల తేజ ద‌ర్శ‌క బాధ్య‌త‌ల‌నుంచి తొల‌గిపోయారు.
 
ఇక రీసెంట్ గా ఈ చిత్రినికి ద‌ర్శ‌క‌త్ం వ‌హించేందుకు క్రిష్ ఎంటర్ అయ్య‌డు. దీంతో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రెగ్యుల‌ర్ షూటింగ్ కు  ఇంకాస్త టైం పట్టేలా ఉండడంతో ఈ గ్యాప్‌లో మరో సినిమా చేయాలని  బాలయ్య  భావిస్తున్నార‌ట‌. ఈ క్ర‌మంలో బాల‌య్య‌ తన తదుపరి చిత్రానికి ఓకే చెప్పడంతో ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ రంగంలోకి దిగాడు. 
 
ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు, స్క్రిప్ట్ వర్క్ పూర్తి కావచ్చింది. ఫ్యాక్షన్ నేపథ్యంలోనే సినిమా ఉంటుందని టాక్. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన చెన్నకేశవరెడ్డి ఆశించిన విజయాన్ని అందుకోలేక పోయిన సంగ‌తి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేష‌న్ లో సినిమా చేయల‌ని ప్రయత్నాలు జరిగాయి కానీ వర్కఔట్ కాలేదు. 
 
ఇక ఇన్నాళ్లకు ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ ఈ సినిమాను సెట్‌ చేశాడు. జూలైలో ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకువ‌చ్చేందుకు చిత్ర యూనిట్ ముంమ్మ‌రంగా ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌ట‌. దాంతోపాటు సినిమాకు టైటిల్ పెట్టే ఆలోచనలో కూడా పడ్డారు. ఈ కథ ప్రకారం ఎకే 47 అనే టైటిల్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నాడట దర్శకుడు. మరి ఈ టైటిల్‌పై బాలయ్య ఎలా రెస్పాండ్ అవుతాడో చూడాలి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.