అభిమానుల మాటకి బాలక్రిష్ణ వాల్యూ ఇస్తాడా..

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

balakrishna
Updated:  2018-11-01 04:51:48

అభిమానుల మాటకి బాలక్రిష్ణ వాల్యూ ఇస్తాడా..

నందమూరి తారకరామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ఎన్టీఆర్ బయోపిక్. నందమూరి బాలక్రిష్ణ ఈ సినిమాలో నటిస్తున్న సినిమాని నిర్మిస్తున్నాడు. దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి బాగం ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 9న, రెండవ బాగం ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాని అదే నెల జనవరి 24న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు.

అయితే ఈ రెండు చిత్రాలకు మధ్య కేవలం రెండు వారాల గ్యాప్ మాత్రమే ఉండటంతో నందమూరి అభిమానులు ఈ చిత్రం కలెక్షన్స్ మీద ప్రభావం చూపిస్తుందని భావిస్తున్నారట. దీంతో రెండో బాగాన్ని మరి కొంత సమయం తీసుకొని విడుదల చేయాల్సిందిగా మూవీ యూనిట్ కు అభిమానులు సూచిస్తున్నట్లు తాజా సమాచారం. ఈ దిశగా ఇప్పటికే బాలక్రిష్ణ ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తుంది.కానీ అభిమానుల మాటకి వాల్యూ ఇస్తాడా లేదా చూడాలి.

ఒకవేళ రెండో భాగం పోస్ట్ పోన్ అయిన కూడా ఫిబ్రవరి లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. కానీ ఈ విషయంపై మూవీ యూనిట్ ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం బాలక్రిష్ణ, విద్యాబాలన్ మీద కొన్ని ముఖ్యమైన సన్నివేశాల్ని షూట్ చేస్తున్నాడు క్రిష్.

షేర్ :

Comments

0 Comment