"సై రా" సెట్ కి బాలయ్య ఎందుకు వెళ్ళాడు ?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

balakrishna and sai ra
Updated:  2018-08-31 11:24:20

"సై రా" సెట్ కి బాలయ్య ఎందుకు వెళ్ళాడు ?

ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘సైరా’ చిత్రం తాలూకు టీజర్ ఇప్పటికే యూట్యూబ్ లో సంచలనం సృష్టించింది. మెగాస్టార్ చిరంజీవి తో పాటు అమితాబ్ బచ్చన్, విజయసేతుపతి, కిచ్చా సుధీప్ లాంటి ఇతర సినీపరిశ్రమ దిగ్గజాలు నటించడంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులను సొంతం చేసుకోబోతుందో అని ఆశక్తి తెలుగు సినివర్గాలలో నెలకొంది.
 
ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితాధారం గా తెరకెక్కనున్న ఈ చిత్రం తాలూకు చిత్రీకరణ పనులు పరుగులు పెడుతున్నాయి. ప్రొడ్యూసర్ కూడా మంచి డబ్బులున్నోడే! కావడంతో ఖర్చుకు కూడా ఎక్కడా వెనకాడే ప్రసక్తి ఉండబోదు అని వినికిడి. అయితే తాజాగా ఈ చిత్రం చిత్రీకరణలో ఒక అనుకోని అతిధి విచ్చేసి అందరిని ఆశ్చర్యంలో ముంచేశారు. అదేనండి మన బాలయ్య ‘సైరా’ సెట్లో సందడి చేశారు.
 
ఈ విషయానికి సంబంధించిన ఫోటోలు లేకపోయినా సెట్లో ఉన్న జనాలవల్ల ఈ వార్త దావానంలా వ్యాపిస్తోంది. వీరిరువురు కలిసి చాలసేపే ముచ్చటించుకున్నారని తెలిసింది. ఈ ఇద్దరు తెలుగు సినీపరిశ్రమలో దిగ్గజాలు. అంతేకాక మంచి స్నేహితులుకుడా. మొన్నామధ్య ఒకేసారి విడుదల అయిన వీరి చిత్రాలు "ఖైదీ నెం:150" మరియు "గౌతమిపుత్ర శాతకర్ణి" లు రెండు ఘన విజయం సాధించాయి. కానీ వీరి అభిమానులు మాత్రం అనవసరమైన వాటిని వారికి ఆపాదించుకుని గొడవలు పడుతుండటం మనం చేస్తూనే ఉన్నాము.

షేర్ :