అక్క‌డ‌ బాలకృష్ణ స్టూడియోస్ రెడీ అవుతుంది

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

balakrishna
Updated:  2018-08-22 06:00:45

అక్క‌డ‌ బాలకృష్ణ స్టూడియోస్ రెడీ అవుతుంది

తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మద్రాస్ నుంచి హైదరాబాద్ కి షిఫ్ట్ అయినప్పుడు అక్కినేని నాగేశ్వర్ రావు తన సొంత డబ్బులతో అన్నపూర్ణ స్టూడియోస్ ని నిర్మించాడు. ఇప్పుడు అదే స్టూడియోస్ లో కొన్ని వందల సినిమా షూటింగ్స్ జరుగుతున్నాయి.
 
అలాగే నిర్మాత డబ్బు బాయి రామానాయుడు కూడా రామానాయుడు స్టూడియోస్ పేరుతో స్టూడియో కట్టాడు. అయితే ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ విడిపయినప్పుడు మెగాస్టార్ కూడా విశాపట్టణం లో ఒక స్టూడియో ఏర్పాటు చేయాలని కలలు కన్నాడు. కానీ స్టేట్ గవర్నమెంట్ నుండి తగిన సహాయం లభించకపోవడంతో ఆలోచనను వదులుకున్నాదు చిరంజీవి. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మాత్రం గవర్నమెంట్ సహకారంతో ఒక స్టూడియోని నిర్మించాలి అని బాలకృష్ణ అనుకుంటున్నాడు.
 
దీనికి శంకుస్థాపన నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా జరుగుతుందని సమాచారం. అంతే కాదు. ఏవిఎం ప్రొడక్షన్ హౌస్ వారు కుడా వైజాగ్ లో ఫిల్మ్ స్టూడియో కట్టడానికి ముందుకువస్తారని టాక్. ఇప్పటికే ఋషికొండ బీచ్ రోడ్ దగ్గర రామానాయుడు స్టూడియో ఉంది. ఇక ఇప్పుడు బాలకృష్ణ స్టూడియోస్ తో అక్కడ కూడా తెలుగు సినిమా షూటింగ్స్ జోరుగా సాగుతాయి అని అంటున్నారు ఫిలిం నగర్ జనాలు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.