ఎన్టీఆర్ తో బాలకృష్ణ ఎం మాట్లాడాడు ?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-09-01 11:29:44

ఎన్టీఆర్ తో బాలకృష్ణ ఎం మాట్లాడాడు ?

నందమూరి హరికృష్ణ రోడ్ ప్రమాదం లో మృతి చెంది నందమూరి ఫ్యామిలీ ని అలాగే నందమూరి అభిమానుల్ని ఎంతో బాధలో పడేసి తిరిగి రాని లోకాలకి వెళ్ళాడు. అయితే ఇలాంటి టైం లోతండ్రిని కోల్పోయిన ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ లకు ఈ సమయంలో బాలకృష్ణ తండ్రిలా అండగా ఉండి వారిని ముందుకు నడిపించాల్సిన అవసరం ఉంది అని అనుకుంటున్నారు.
 
అలా అనుకున్నారో లేదో బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కి తోడుగా నిలిచాడు. నిన్న హరికృష్ణ ఇంట్లో ఎన్టీఆర్. కళ్యాణ్ రామ్ తో కలిసి భోజనం చేస్తూ ముచ్చటించాడు బాలకృష్ణ. అయితే గత కొన్నాళ్లుగా నందమూరి ఫ్యామిలీలో విభేదాలు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో బాలకృష్ణ ఆ భాద్యత తీసుకుంటాడా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేసారు.
 
కాని అన్న మరణంతో బాలకృష్ణ కుమిలి పోవడంతో పాటు తన అన్న కొడుకులకు అండగా ఉండి ధైర్యంగా నిలబడాలని ముందుకు రావడం చాలా గొప్ప పరిణామం అని చాలా మంది అంటున్నారు. కనీసం ఈ రకంగా అయిన ఎన్టీఆర్, బాలకృష్ణ కలిసారు అనే ఒక చిన్న ఆనందంలో నందమూరి అభిమానులు ఉన్నారు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.