నాగ శౌర్య కి వార్నింగ్ ఇచ్చిన బాలకృష్ణ ?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

balakrishna and naga sourya
Updated:  2018-08-04 11:34:52

నాగ శౌర్య కి వార్నింగ్ ఇచ్చిన బాలకృష్ణ ?

యంగ్ హీరో నాగ శౌర్య నటిస్తున్న లేటెస్ట్ సినిమా "నర్తనశాల". శ్రీనివాస్ అనే కొత్త కుర్రాడు డైరెక్ట్ చేస్తున్నఈ సినిమా ఆగష్టు 31 న రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాకి మహానటుడు ఎన్టీఆర్ నటించిన క్లాసిక్ సినిమా అయిన "నర్తనశాల" అనే టైటిల్ ని వాడుకున్నారు మూవీ యూనిట్.
 
అయితే ఈ విషయం మీద బాలకృష్ణ నాగ శౌర్య పై సీరియస్ అయినట్టు తెలుస్తుంది. తన పర్మిషన్ లేకుండా టైటిల్ ఎలా వాడుకున్నావు అని డైరెక్టర్ ని నాగ శౌర్య కి బాలకృష్ణ క్లాస్ పీకాడు అని తెలుస్తుంది. అసలైతే బాలకృష్ణ ఇదే టైటిల్ మీద సినిమా ప్లాన్ చేసాడు, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. ఈ లోపు నాగ శౌర్య తన సినిమాకి ఈ టైటిల్ పెట్టేసుకున్నాడు.
 
ఇక ఇదే విషయం మూవీ యూనిట్ దగ్గర ప్రస్తావిస్తే అసలు మాకు ఎలాంటి ఫోన్ కాల్ రాలేదు బాలకృష్ణ గారి దగ్గర నుంచి అవన్నీ రూమర్స్ అని కొట్టిపారేసారు. ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై నాగ శౌర్య వాళ్ళ అమ్మ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తుంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.