క్రిష్ ప్ర‌పోజ‌ల్ ని తిర‌స్క‌రించిన బాల‌య్య

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

krish and balakrishna
Updated:  2018-06-27 11:27:07

క్రిష్ ప్ర‌పోజ‌ల్ ని తిర‌స్క‌రించిన బాల‌య్య

గ‌తంలో సినిమా ద‌ర్శ‌కుడు సినిమా క‌థ  చెబితే ఎటువంటి మార్పులు లేకుండా న‌టించే వారు హీరోలు హీరోయిన్లు.. కాని ఈ రోజుల్లో ద‌ర్శ‌క‌త్వంలో కూడా చాలా మంది హీరోలు వేలు పెడుతున్నారు అనే పెద్ద అభాండం టాలీవుడ్ లో వినిపిస్తోంది. నిజ‌మే ఆ నాడు ఎన్టీఆర్, ఏ ఎన్నార్, కృష్ణ సినిమాలు ద‌ర్శ‌కుల మాట‌ల‌పైనే అంత హిట్ అయ్యేవి. ఇక ఇప్పుడు ప్ర‌తీ క‌థ‌లో వేలు పెట్టే ఓ హీరో గురించి తెలిసిందే.. అయితే హిట్ అయితే అత‌ని ఖాతాలోకి, హిట్ కాక‌పోతే ద‌ర్శ‌కుడి ఫెయిల్యూర్ గా అభివ‌ర్ణిస్తారు స‌ద‌రు హీరో.
 
ఇక ఇప్పుడు ఎన్టీఆర్ బ‌యోపిక్ టాలీవుడ్ లో ట్రెండ్ సెట్ట‌ర్ గా నిలిచింది.ఈ సినిమా పై రోజుకో వార్త వినిపిస్తోంది.. ప‌ది మంది ద‌ర్శ‌కుల‌ను ఫైనల్ గా అనుకుని చివ‌ర‌కు క్రిష్ కు బాల‌య్య ఈ సినిమా బాధ్య‌త‌లు అప్ప‌గించారు.. స్వియ ద‌ర్శ‌కత్వం చేయాలి అని భావించినా, మ‌ళ్లీ ఆ నిర్ణ‌యం నుంచి వెన‌క్కి వెళ్లారు నంద‌మూరి బాల‌య్య బాబు. ఇక ఈ సినిమా ఎలా ఉండాలి ఎలా తీయాలి ఏమేమి విష‌యాలు ప్ర‌జ‌ల‌కు క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపించాలి అనేది.. బాల‌య్య ఓ బ్రీఫ్ ప్రింట్ ఇచ్చార‌ట క్రిష్ కు.
 
అయితే ఈ క‌థ ఇలా చేయాలి అంటే రెండు పార్ట్ లు గా తీయాలి అని ఒకే పార్ట్ గా తీస్తే చాలా వ‌రకూ ప్ర‌జ‌ల‌కు రీచ్ అయ్యే పాయింట్స్ ని, అర్ద‌వంతంగా చూప‌లేము అని చెప్పార‌ట క్రిష్. ఇక ఎన్టీఆర్ పుట్టుక నుంచి మ‌ర‌ణం వ‌ర‌కూ చూపిద్దాం రెండు పార్ట్ లుగా తీద్దాం అని చెబితే దీనికి బాల‌య్య నో అన్నార‌ని, ఇప్పుడు ఈ వార్త  టాలీవుడ్ లో వైర‌ల్ అయింది.
 
మ‌నం చెప్పాలి అని అనుకున్న క‌థ ఒక్క రూపంగానే తీయాలి, ఒకే సినిమాగా చూపించాలి అని చెప్పార‌ట బాల‌య్య దీంతో క్రిష్ కూడా క‌థ‌లో మెయిన్ పాయింట్ల‌తో స్క్రిప్ట్ ప‌నుల్లో బిజీగా మారార‌ట‌.. నిజ‌మే ఎన్నిక‌ల‌కు మ‌రో ప‌ది నెల‌లు స‌మ‌యం ఉంది ఇక రెండు పార్ట్ లు అంటే రెండేళ్లు ఆగాల్సిందే, అందుకే బాల‌య్య ఈ నిర్ణ‌యం తీసుకున్నారు అంటున్నారు ఆయ‌న అభిమానులు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.