కోర్ట్ కి మాస్క్ వేసుకొని వచ్చిన బండ్ల గణేష్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

bandla ganesh
Updated:  2018-09-10 01:05:35

కోర్ట్ కి మాస్క్ వేసుకొని వచ్చిన బండ్ల గణేష్

తెలుగు లో "బాద్షా" "ఆంజనేయులు" "గబ్బర్ సింగ్" వంటి సినిమాలని ప్రొడ్యూస్ చేసి నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్నాడు బండ్ల గణేష్. కానీ ఇటివలే ఆయన సినిమాలు ఏవి ప్రొడ్యూస్ చెయ్యట్లేదు. అయితే మొన్న బండ్ల గణేష్ ఒక కోర్ట్ కి హాజరవుతూ ముఖానికి మాస్క్ కట్టుకొని వచ్చాడు అంట.

అసలు విషయానికి వస్తే బండ్ల గణేష్ కు, ప్రొద్దుటూరు కు చెందిన 68 మంది వడ్డీకి డబ్బులిచ్చారు. అయితే ఆ లావాదేవీలకు చెందిన చెక్కులను బండ్ల గణేష్ వారికిచ్చాడు. అవి కాస్త బౌన్స్ అయ్యాయి. దాంతో బాధితులను కోర్టును ఆశ్రయించారు. ఇందులో మూడు కేసులకు సంబంధించి బండ్ల గణేష్ కు కోర్టు సమన్లు జారి చేసింది.

మరోవైపు లోక్ అదాలత్ లో మూడు కేసులకు సంబంధించి రాజీ అయినట్లు తెలుస్తుంది. కేసు విచారణ అనంతరం తదుపరి విచారణను అక్టోబర్ 9కి కోర్టు వాయిదా వేసింది. కానీ ఇదంతా ఎక్కువ మందికి తెలియదు, ఇక ఎట్టకేలకు కోర్ట్ మెట్లు ఎక్కినా బండ్ల గణేష్ ఈ విషయం ఎవరికీ తెలియకూడదు అనే ఉద్దేశంతో ముఖానికి మాస్క్ కట్టుకున్నట్టు తెలుస్తుంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.