బెల్లంకొండ వారసుడు భారీగానే ప్లాన్ చేసాడు.

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

bellamkonda srinivas
Updated:  2018-07-05 18:29:58

బెల్లంకొండ వారసుడు భారీగానే ప్లాన్ చేసాడు.

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అయిన బెల్లంకొండ సురేష్ కొడుకుగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ప్రస్తుతం ఈ ప్రొడ్యూసర్ కొడుకు ఇండస్ట్రీ లో మంచి కమర్షియల్ హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సాక్ష్యం. ఇటివలే షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా యొక్క ఆడియోలాంచ్ ని ఈ నెల 7న గ్రాండ్ చేయాలి అని భావిస్తున్నారు మూవీ యూనిట్.

ఈ ఈవెంట్ ని శిల్పకళ వేదిక లో జరిపి ఆ ఈవెంట్ కి స్టార్స్ అందరిని పిలిచి తన పలుకుబడితో సినిమా ని బాగా ప్రోమోట్ చేసుకోవాలి అనుకుంటున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. శ్రీవాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ అయిన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. హర్షవర్దన్ రామేశ్వర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజి లో ఉన్న ఈ సినిమా యొక్క రిలీజ్ డేట్ ని త్వరలో అధికారికంగా ప్రకటిస్తారు నిర్మాతలు. అభిషేక్ పిక్చర్స్ పై అభిషేక్ నామ నిర్మిస్తున్న ఈ సినిమాకి వివేక్ కూచిబొట్ల కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూనే బెల్లంకొండ శ్రీనివాస్ తన తదుపరి సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీనివాస్ అనే కొత్త డైరెక్ట్ చేస్తున్నాడు.