భారీ మ‌ల్టీ స్టార‌ర్ సినిమా

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-02-10 12:19:12

భారీ మ‌ల్టీ స్టార‌ర్ సినిమా

ఇటు టాలీవుడ్ లో చూసినా అటు కోలీవుడ్  లో చూసినా గ‌త కొద్ది కాలంగా సినీ ద‌ర్శ‌కులు మ‌ల్టీ స్టార‌ర్ సినిమాల‌ను వెండి తెర‌మీద తెర‌కెక్కించేందుకు ఎక్కువ‌గా ఆశ‌క్తి చూపుతున్నారు....  ఇప్ప‌టికే టాలీవుడ్ ప‌రిశ్ర‌మ‌లో నాచుర‌ల్ స్టార్ నాని, అక్కినేని వార‌సుడు కింగ్ నాగార్జున మ‌ల్టీ స్టార‌ర్ సినిమాను తీయ‌నున్నారు... ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రోడక్ష‌న్స్ ప‌నులు పూర్తి చేసుకుని త్వ‌ర‌లో రెగ్యూల‌ర్ షూటింగ్ ను మెద‌లు పెట్ట‌నుంది చిత్ర యూనిట్. ఇక అదే బాట‌లో చెర్రి జూనియ‌ర్ ఎన్టీఆర్ సినిమా కూడా ప‌ట్టాలెక్క‌నుంది.
 
అయితే ఇదే త‌ర‌హాలోనే కోలీవుడ్  చిత్ర ప‌రిశ్ర‌మ‌లో కూడా మ‌ల్టీ స్టార‌ర్ సినిమాను తెర‌కెక్కించ‌నున్నారు...  క్లాసిక‌ల్ చిత్రాల‌కు కేరాఫ్ అని   గుర్తింపు తెచ్చుకున్న ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు...గ‌తంలో ఈయ‌న గురించి అనేక పుకార్లు వ‌చ్చినా ఆ పుకార్ల‌కు నేడు పుల్ స్టాప్ ప‌డింది..
 
క్లాసిక‌ల్ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం తెర‌కెక్కింబోతున్న భారీ మ‌ల్టీ స్టారర్ సినిమా !! చెక్క చివంత వానమ్‌!!  ఈ చిత్రం తెలుగులో నవాబ్ అనే టైటిల్ తో తెర‌కెక్కించ‌నున్నారు ద‌ర్శ‌కుడు. ఇక ఈ చిత్రంలో శింబు, విజయ్‌ సేతుపతి, అరవింద్‌ స్వామి పేర్లను ఇంత‌కు ముందే  ద‌ర్శ‌కుడు ప్రకటించగా... ఇప్పుడు మ‌రొక హీరో అదనంగా అరుణ్‌ విజయ్ ను తీసుకున్న‌ట్లు తెలుస్తోంది... మద్రాస్‌ టాకీస్‌, లైకా ప్రొడక్షన్స్‌ హౌజ్‌ వారు తెర‌కెక్కించ‌నున్న ఈ సినిమాకు ఎఆర్ రెహ‌మాన్ మ్యూజిక్ అందించ‌బోతున్నారు. దీనిపై కోలీవుడ్ లో అత్య‌ధికంగా చ‌ర్చ జ‌రుగుతోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.