రాజమౌళి తండ్రికి భారీ ఆఫర్ ?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

rajamouli
Updated:  2018-07-27 12:02:34

రాజమౌళి తండ్రికి భారీ ఆఫర్ ?

స్టార్ రైటర్ అయిన విజయేంద్ర ప్రసాద్ ఇటివలే కాలం లో "బాహుబలి" "భజరంగి భాయ్ జాన్" "మేర్సాల్" వంటి హిట్స్ తో మళ్ళి రైటర్ గా తన స్థాయి ఏంటో చాటుకున్నాడు. ప్రస్తుతం ఆయన ప్రముఖ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ తో ఆయన చేతులు కలిపాడు అని తెలుస్తుంది.

ఈరోస్ తో కలసి అయన తెలుగు, తమిళ, హిందీలో పలు సినిమాలు, వెబ్ సిరీస్ కు కథలు అందించడంతో పాటు సినిమాలని నిర్మించి, పంపిణీదారుగా కూడా పని చేయనున్నారు అంట. కాగా ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్ దగ్గర పదికి పైగా కథలు సిద్ధంగా ఉన్నాయి.

అందులో ఒకటి సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ కాగా మరొకటి ఎస్.ఎస్. కంచి దర్శకత్వంలో రూపొందుతుంది. ఇదిలా ఉంటే రాజమౌళి తదుపరి సినిమాకి కూడా ఆయనే కథ అందిస్తున్నాడు. రామ్ చరణ్ ఇంకా ఎన్టీఆర్ కలిస్ నటించబోతున్న ఈ సినిమా కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ నుంచి ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లనుంది. 

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.