అరవింద సమేత కి భారీ రేట్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

aravinda sametha
Updated:  2018-08-08 05:31:51

అరవింద సమేత కి భారీ రేట్

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తొలిసారిగా తెరకెక్కుతున్న చిత్రం “అరవింద సమేత”. హారిక హాసిని క్రియేషన్స్ పై కె.రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.. ఈషా రెబ్బ మరో కీలక పాత్రలో కనిపిస్తోంది.
 
యువ సంగీత సంచలనం ఎస్.ఎస్.తమన్ ఈ చిత్రానికి  ప్రస్తుతం షూటింగ్ పార్ట్ చివరి దశలో ఉన్న ఈ చిత్ర శాటిలైట్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయినట్లు సమాచారం. ఈ చిత్ర రైట్స్ కి గాను ప్రముఖ టీవీ ఛానల్ సంస్థ జీ తెలుగు 23.5 కోట్ల ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం, ఇంత ఎక్కువ ధరకు మారే తెలుగు సినిమా అమ్ముడుకాలేదని తెలుస్తోంది. 
 
ఇక పూర్తి స్థాయి రాయలసీమ యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఇంతకు ముందెన్నడూ కనిపించని విధంగా చాలా కొత్తగా కనిపించనున్నట్టు సమాచారం. ఇక నాగబాబు, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ , రావురమేష్ ముఖ్య పాత్రలో కనిపిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ లో విడుదల చేస్తున్నారు.

షేర్ :

Comments

1 Comment

  1. fedsfd

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.