తప్పుమీద తప్పులు చేస్తున్న కౌశల్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

koushal
Updated:  2018-09-18 06:12:18

తప్పుమీద తప్పులు చేస్తున్న కౌశల్

బిగ్ బాస్ రెండవ సీజన్ చివరి దశకు చేరుకుంటున్న కొద్దీ హౌస్ లో అనేకానేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి.  ఇప్పుడు హౌస్ లో ఆరుగురు మాత్రమే మిగిలున్నారు. మొన్నటివరకు ఒక్కో హౌస్ మేట్ ఒకరు లేదా ఇద్దర్ని ఎలిమినేషన్ కి నామినెటే చేసేవాళ్ళు. ఇప్పుడు అందరు ఎలిమినేషన్ కి నామినెటే అవ్వడం ప్రేక్షకుల్లో ఉత్కంఠ ని మరింత పెంచింది. 

అందరు నామినేట్ అవ్వడానికి ప్రధాన కారణం ఇంటి సభ్యులు పదేపదే నియమాలను ఉల్లంఘించడమే. ఇప్పటికే ప్రతివారం గీత మాధురి వల్ల ఎలిమినేట్ అవుతూ వస్తున్న కౌశల్ మళ్లి తప్పు చేస్తూ పట్టుబట్టాడు. అతను ఒక కార్నర్ లో కాగితం మీద రాస్తూ దొరికిపోయాడు. బిగ్ బాస్ కి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడటం వాల్ల బిగ్ బాస్ అందరిని ఈ వారం ఎలిమినేషన్ కి నామినెట్  చేసేశాడు. తరువాత కౌశల్ అందరిని పిలిచి  కృతజ్ఞత చెప్పడం ఇంటి మిగతా సభ్యులకు కోపం తెప్పించింది.

కౌశల్ వల్లే అందరు ఎలిమినేట్ అయ్యారని అందరూ అగ్గిమీద గుగ్గిలంలా ప్రవర్తిస్తున్నారు. కాగా కౌశల్ మాత్రం ఎప్పటికప్పుడు పరిస్థితులను తనకి అనుగుణంగా మార్చేసుకుంటూ తెలివైన ఆట ఆడుతున్నాను అనుకుంటున్నాడు. ఏది ఏమైనప్పటికి కౌశల్ ఆర్మీ అనేది ఒకటి సామజిక మాధ్యమాలలో నడుస్తూ కౌశల్ ని ఎప్పటికప్పుడు ఎలిమినేషన్ నుండి రక్షిస్తూ వస్తుంది. కానీ ఇప్పుడు కౌశల్ చేసిన పనికి వారు ఎలా రియాక్ట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.