స‌ల్మాన్ కు జైలు శిక్ష‌

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

salman khan jodhpur court
Updated:  2018-04-05 17:08:50

స‌ల్మాన్ కు జైలు శిక్ష‌

1998లో కృష్ణ జింకను వేటాడిన కేసులో సల్మాన్‌ ఖాన్‌కు చుక్కెదురైంది...కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ ని దోషిగా తేల్చింది జోధ్‌పూర్ కోర్టు..... ఈ కేసులో సల్మాన్‌ ఖాన్‌ దోషేనని రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ న్యాయస్థానం  కీలక తీర్పు వెలువరించింది. 
 
స‌ల్మాన్ కు రెండు సంవ‌త్స‌రాలు జైలు శిక్ష విధించింది..1998లో వచ్చిన హమ్‌ సాథ్‌ సాథ్ హై చిత్రీకరణ సమయంలో సల్మాన్‌ కృష్ణజింకను వేటాడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలో సైఫ్‌ అలీ ఖాన్‌, సోనాలి బింద్రే, టబు, నీలమ్‌ కూడా ఉన్నారు.... వీరిని నిర్దోషులుగా తేల్చింది కోర్టు...ఇక ఈఘ‌ట‌న‌కు సంబంధించి మొత్తం మూడు కేసులు న‌మోదు అవ్వ‌గా, అక్ర‌మాయుధాల కేసులో స‌ల్మాన్ నిర్దోషిగా బ‌య‌ట‌కు వ‌చ్చారు ఇప్పుడు జింకను వేటాడిన కేసులో మాత్రం స‌ల్మాన్ శిక్ష కు గుర‌య్యారు.
 
అయితే ఈ కేసులో ఏడేళ్ల వ‌ర‌కూ శిక్ష ప‌డ‌వ‌చ్చు కాని స‌ల్మాన్ సేవ‌ను దృష్టిలో ఉంచుకుని రెండు సంవ‌త్స‌రాలు జైలు శిక్ష విధించాలి అని లాయ‌ర్లు కోరారు.. గ‌తంలో హిట్ అండ్ ర‌న్ కేసులో స‌ల్మాన్  పై అభియోగాలు వ‌చ్చాయి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.