లైంగిక వేధింపులు పై స్పందించిన బాలీవుడ్ నటి కాజోల్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

bollywood heroine kajol
Updated:  2018-10-05 12:14:46

లైంగిక వేధింపులు పై స్పందించిన బాలీవుడ్ నటి కాజోల్

సమాజంలో ఆడవాళ్ళు ముఖ్యంగా ఎదుర్కొంటున్న సమస్య లైంగిక వేధింపులు.. ప్రతీ పరిశ్రమలో ఈ సమస్య ఉన్నా, ఎక్కువగా అందరి దృష్టి పడేది మాత్రం సినిమా ఇండస్ట్రీ వైపే.. మీడియా ఫోకస్ సినిమా వాళ్లపై ఉండడం దానికి ప్రధాన కారణం. మహిళల పై లైంగిక వేధింపులు పై రీసెంట్ గా బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ స్పందించారు.

మహిళలపట్ల లైంగిక వేదింపులు నిజమే అని, అయితే ఇవి కేవలం చిత్ర పరిశ్రమకి మాత్రమే పరిమితం కాలేదని అన్ని చోట్ల జరుగుతున్నాయని అన్నారు.తను శ్రీ దత్తా, నానా పటేకర్ వ్యవహారంపై మాట్లాడుతూ ఆమె ఈ విధంగా స్పందించారు. నేను ఎప్పుడు ఇలాంటి వేధింపులు ఎదుర్కోలేదని, కానీ దీని గురించి విన్నానని ఆమె అన్నారు..

అటువంటి సంఘటనలు నా ముందెప్పుడు జరగలేదు.. జరిగి ఉంటే నేను ఏదొకటి చెసేద్దాన్ని లేదా ఆపడానికి ప్రయత్నిస్తాను అని చెప్పింది.. లైంగిక వేదింపులు కేవలం చిత్ర పరిశ్రమకు మాత్రమే పరిమితం కాలేదు. అన్ని చోట్ల ఉన్నాయన్నారు. విదేశాల్లో మాదిరిగా మీటూ లాంటి ఉద్యమం మన దేశంలో కూడా రావాలన్నారు. ఇలాంటి వాటి పై పోరాడే చట్టాల పై మహిళలు పూర్తి అవగాహన తో ఉండాలని ఆవిడ వ్యాఖ్యనించారు...

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.