సాహో హీరోయిన్ రేటెంతో తెలుసా..?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

shraddha kapoor
Updated:  2018-09-03 12:07:51

సాహో హీరోయిన్ రేటెంతో తెలుసా..?

“సాహో” బాహుబలి తర్వాత ప్రభాస్ కథానాయకునిగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం. భారీ నిర్మాణవ్యవంతో అత్యాధునిక సాంకేతిక విధానాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి హీరోయిన్ గా చాలా మందిని అనుకున్న తర్వాత చివరిగా శ్రద్ధా కపూర్ ని ఎంచుకున్నారు దర్శక నిర్మాతలు.ఈమె ఇప్పటికే చిత్రీకరణలో చురుగ్గా పాల్గొంటోంది.

మొన్నామధ్య ఆమె పారితోషకం గురించి చాలా చర్చ జరిగినా నిజానిజాలు ఎవ్వరికి తెలియలేదు. కాగా ఈ మధ్య ఆమె పారితోషకం ఎంతో చిత్రబృందం లీక్ చేసింది. అక్షరాలా 3 కోట్ల రూపాయలు ఈమె ఈ చిత్రంలో నటించినందుకు తీసుకోనుంది. ఇప్పటి వరకు ఏ హీరోయిన్ కూడా తెలుగులో అంత మొత్తం పుచ్చుకోలేదు. ఎప్పుడో అనుష్క కి ఒక సినిమా కోసం ఒక కోటి రూపాయలు ఇచ్చారు అంతే.

మరెందుకు ఈ బాలీవుడ్ భామకు ఇంత రేటు అంటే సమాధానం సుమారుగా లేదనే చెప్పాలి. కాకపోతే ఈ చిత్రయూనిట్ మాత్రం ఆ ముడు కోట్లకు తగ్గ పనిని దర్శకుడు ముక్కుపిండి మరీ పని చేయించు కుంటున్నా దంటా. ఈమె కూడా ఈ చిత్రంలో ప్రభాస్ తో పాటు యాక్షన్ చేస్తుంది. స్టంట్ ల విషయంలో కానీ, డాన్సుల విషయంలో ఇలా ప్రతి దాంట్లో ఈమే చెమటలు చిందిస్తుంది అని వినికిడి.

షేర్ :