అవును నేను మందు తాగుతాను, సిగరెట్ కూడా తాగుతాను...

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

swetha salve
Updated:  2018-11-03 05:08:17

అవును నేను మందు తాగుతాను, సిగరెట్ కూడా తాగుతాను...

బాలీవుడ్ హీరోయిన్ శ్వేతా సాల్వే కి పెద్దగా క్రేజ్ లేకున్నా కూడా సోషల్ మీడియా లో తెగ హంగామా చేస్తూ ఉంటుంది. ఇటివలే శ్వేత తన కుటుంబంతో కలిసి విహారయాత్ర కోసం గోవాకు వెళ్లింది. అక్కడ బికినీ వేసుకుని సిగరెట్ తాగుతూ ఒక ఫొటో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. ఈ ఫోటో చూసిన కొంత మంది ఆమె పై బాగా సీరియస్ అయ్యారు, మరి కొంత మంది శ్వేతని ట్రోల్ చేసారు కూడా.

దీనికి శ్వేతా సీరియస్ గా సమాధానం ఇస్తూ అవును నేను మద్యం తాగుతాను, ధూమపానం చేస్తాను. ఈ విషయాల్లో నేను నిజాయతీగా ఉంటాను. కేవలం మద్యం, సిగరెట్‌ తాగడం వల్ల చెడ్డ తల్లిని ఎలా అవుతాన? నేను ఈ అలవాట్ల వల్ల నా జీవితాన్ని వృథా చేసుకోవడం మీరు చూశారా, పనిచేయకుండా ఖాళీగా గడపడం చూశారా, నా పిల్లల్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం చూశారా, నేను నటిని. డ్యాన్సర్‌ని. వ్యాపారవేత్తను కూడా. నా తల్లిదండ్రులు నన్ను పద్ధతిగానే పెంచారు.

సమాజంలోని మంచి, చెడు తెలియజేశారు. అసలు మీకు ఇలాంటివి నచ్చకపోతే నన్ను ఫాలో అవ్వకండి. అంతే గాని నన్ను జడ్జ్ చేసే హక్కు మీకు లేదు అంటూ తెగ సీరియస్ అయిపొయింది ఈ భామ.

షేర్ :

Comments

0 Comment